వైసీపీలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ ఇంచార్జ్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న మం త్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ స్థానంలో అనూహ్యంగా తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసిన బొప్ప‌న భ‌వ‌కుమార్ ఓడిపోయారు. అయితే, ఈయ‌న‌కు తాజాగా వైసీపీ అధి నేత జ‌గ‌న్‌.. విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ ఇంచార్జ్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. అయితే, మిగిలిన న‌గ‌రాల మా ట ఎలా ఉన్నా.. విజ‌య‌వాడ న‌గ‌ర రాజ‌కీయాల్లో మాత్రం దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం, ఇక్కడి వ్యూహాలను త‌ట్టుకుని ముందుకు సాగ‌డం అనేది ప్ర‌ధాన స‌వాలే! ముఖ్యంగా విజ‌య‌వాడ న‌గ‌ర ఇంచార్జ్‌గా ఉన్న వారికి నిత్య సవా ళ్లు స‌ర్వ సాధారణం.

 

ఒక్క‌సారి విజ‌య‌వాడ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ఇక్క‌డ టీడీపీ ప్ర‌స్తుతం చాలా బ‌లంగా ఉంది. తూర్పు, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నాయ‌కులు స‌త్తా చాటుతున్నారు. 2014కు ముందు ప‌రిస్థితి ఎలా ఉ న్నా.. త‌ర్వాత మారిన ప‌రిస్థితి మాత్రం టీడీపీకి అనుకూలంగా మారిపోయింది. తూర్పులో 2014, 2019 ఎ న్నిక‌ల్లో టీడీపీ నాయ‌కుడు గ‌ద్దె రామ్మోహ‌న్ విజ‌యం సాధించారు. ఇక‌, సెంట్ర‌ల్ విష‌యానికి వ‌స్తే.. 2014 లో టీడీపీ నేత బొండా ఉమా భారీ మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. 

 

ఇక‌, ఈ ఏడాది జ‌రిగిన ఎన్ని క‌ల్లో కేవ‌లం 25 ఓట్ల తేడాతోనే ఆయ‌న ప‌రాజయం పాల‌య్యారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ ఊసు, ఊపు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ ప్ర‌భావం పెద్ద‌గా లేదు. పైగా తూర్పులో గ‌ద్దె హవాను త‌ట్టుకుని నిల బ‌డే నాయ‌కుడు కూడా వైసీపీలో క‌నిపించ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఇక‌, ప‌శ్చిమ నియోజ‌క వ‌ర్గంలో పాలిటిక్స్ నిల‌క‌డ‌గా సాగ‌డం లేదు. 2009లో ఇక్క‌డ ప్ర‌జారాజ్యం గెలిస్తే.. 2014లో వైసీపీ గెలిచింది. 

 

ఇక‌, ఈ ఎన్నిక‌ల్లోనూ వైసీపీ గెలిచినా.. ఇక్క‌డ త‌ట‌స్థ ఓటింగ్ స‌హా టీడీపీ నాయ‌కులు ఎక్కువ‌గా ఉన్నా రు. ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న స‌హా నాగుల్ మీరా వంటి కీల‌క నాయ‌కులు ఉన్నారు. దీంతో టీడీపీ పుంజు కునే ప‌రిస్థితే ఎక్కువ‌గా ఉంది. దీనికి తోడు .. న‌గ‌ర వైసీపీలో నాయ‌కుల‌కు ఒక‌రంటే ఒక‌రికి పొస‌గ‌ని ప‌రి స్థితి ఉంది. దీంతో వీరిని అంద‌రినీ ఏక‌తాటిపైకి న‌డిపించ‌గ‌లిగే నాయ‌కుడిగా బొప్ప‌న ఏమేర‌కు స‌ఫ‌లీ కృతం అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: