వ్యూహాలు ఏవీ లేకుండా దూకుడు మాత్రమే ఉంటే ఇలాగే జరుగుతుంది. ప్రత్యర్ధుల బలం, బలగం వూహించకుండా అవకాశం దొరికింది కదా అని వీర విజ్రుంభణ  చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. విషయంలోకి వస్తే ఆయన పేరు అశ్వధ్ధామ రెడ్డి. ఆయన పేరు అలనాటి భారతాన్ని గుర్తుకుతెస్తోంది. ధర్మరాజు  యుద్ధంలో అశ్వధ్ధామ హతహ అంటాడు, తరువాత జరిగింది కుంజరం అనే ఏనుగు చావు. అంటే ఆర్టీసీలో కూడా ఎర్ర బస్సుకు బైర్లు కమ్మి టైర్లు  అరిగాయన్నమాట.

 

సరిగ్గా దస‌రా సమయం.  ఓ వైపు చాలా  సెలవులు. వూళ్ళకు వూళ్ళు ఖాళీ అవుతాయి. ఎర్ర బస్సుకు మంచి డిమాండ్ ఉంటుంది అని తెలంగాణా ఆర్టీసీ సమ్మెకు సై అంది. ఎంచుకున్న ముహూర్తం కరెక్టుగానే ఉంది. మరో వైపు హుజూరాబాద్ ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. దాంతో వీరలెవెల్లో సమ్మె మొదలైంది. జనం అష్టకష్టాలు పడ్డారు. మొదట్లో సమ్మెను తిట్టుకున్నారు. ఆ తరువాత కేసీయార్ పోకడలపైన విసుక్కున్నారు. ఇంతలో ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీయారెస్ విజయభేరీ మోగించింది.

 

మరో వైపు రాజకీయ పార్టీల దూకుడు తగ్గింది. అధికార పార్టీలో పట్టుదల పెరిగింది. ఇంతవరకూ సమ్మె భీకరంగా   జరిగింది, ఆ తరువాత విడుపు ఉంటే బాగుండేది కానీ, జరిగింది వేరు. మరింత దూకుడుగా ఆర్టీసీ సమ్మె చేయాలని చూశారు. ఉప ఎన్నికల తరువాత ఓ విధంగా చెప్పాలంటే సమ్మె స్పీడ్ తగ్గిపోయింది. దానికి రాజకీయ పార్టీల వైఖరి కావడమే. దీన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రతిపక్షాలు చూశాయి. ఆ ట్రాప్ లో  టీ ఆర్టీసీ జేఏసీ పడిపోయింది.

 

అంతే కేసీయార్ మరింత మొండికెత్తారు. ఇక మరిన్ని రోజులు సమ్మె  చేయాల్సివచ్చింది. కానీ ఏం జరుగుతుందన్నది  తెలిసిపోతూనే ఉంది. దాంతో ముందే  కోర్ట్ మీద గౌరవంతోనో, లేక ప్రభుత్వ పిలుపునకు స్పందించో సమ్మె సైరన్ కూత  ఆపేస్తే బాగుండేది. అది జరగలేదు. చివరికి రెండు నెలల పాటు లాగించిన సమ్మె అర్ధం పర్ధం లేకుండా ముగించేశారు. ఇపుడు కేసీయార్ ఏ చేస్తే అదే శాసనం. 29 మంది ఆర్టీసీ కార్మికులను చంపుకుని ఆర్టీసీ సమ్మె సాధించిందేంటి అంటే శూన్యమే. అందుకే భారతంలో అశ్వద్ధామ హతహా అన్నట్లుగా ఆర్టీసీ చక్రం అడ్డంగా విరిగిపోయిందంతే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: