అక్టోబర్ 4 2019 నాడు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగింది. టిఎస్‌ఆర్‌టిసిని రాష్ట్ర ప్రభుత్వంతో విలీనం చేయడం, బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత, ఖాళీలను భర్తీ చేయడం వంటివి 26 వినతులు ఉన్నాయి. అర్ధ రాత్రి నుండి బస్సులు నిలిపివేయడమైనదని, తెలంగాణ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తో చర్చలు విఫలమైనట్లు అందుకే సమ్మెకు వెళుతున్నట్లు కార్మిక నాయకులుతెలిపారు .ఈ సమ్మె వాళ్ళ ప్రజలు ఇబ్బందులు పడకూడదానివో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది

అక్టోబర్ 5 న సమ్మె చేస్తున్న కార్మికులపై ప్రభుత్వం ఆగ్రహం,సాయంత్రం 6 గంటల లోపు విధుల్లో చేరిన వారినే ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిస్తామని, చేరని వారిని తొలిగిస్తామని విధాన నిర్ణంయం తీసుకుంది.

అక్టోబర్ 6 విపక్ష పార్టీల మద్దతు కోరిన ఐకాస నేతలు,ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం ప్రసక్తే లేదన్న కేసీర్ 

అక్టోబర్ 7  ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేసీర్ సమీక్ష,ప్రత్యామ్నాయ విధానాలపై చర్చ,కార్మికుల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తామని ఐకాస నాయకుల వెల్లడి.

అక్టోబర్ 8 కొనసాగిన సమ్మె,డిపోల వద్ద 144 సెక్షన్ విధింపు
అక్టోబర్ 9  ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిల పక్ష భేటీ పాల్గొన్న ప్రతిపక్ష పార్టీలు,వారికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటన,తెలంగాణా బండ్ కు పిలుపు అక్టోబర్ 10  సమ్మె ను విరమించేలా చర్యలు తీసుకోవాలని ప్రభత్వాన్ని ఆదేశించిన హైకోర్టు,కార్మికుల తొలగింపు వ్యాజ్యంపై విచారణ ప్రారంభం,నివేదిక సమర్పించిన ప్రభుత్వం
అక్టోబర్ 11 ప్రతిపక్ష నేతలతో మరోసారి కార్మిక నాయకుల భేటీ,పలు చోట్ల రోడ్డుపై వంటా వార్పూ చేసి నిరసన 
అక్టోబర్ 12 ఖమ్మం కల్లెక్టరేట్ వద్ద డ్రైవర్ శ్రీనివాస రెడ్డి  ఆత్మాహత్యాయత్నం పరిస్థితి విషమం,ఖమ్మం బండ్ కు పిలుపు 
అక్టోబర్ 13 డ్రైవర్ శ్రీనివాస రెడ్డిని అపోలో కు తరలింపు,బలిదానాలు చేసుకోకండని నాయకుల వినతి, బందోబస్తు పెంచాలని కేసీర్ పోలీసులకు హుకుం జారీ 
అక్టోబర్ 14 ఆందోళన వీడి చర్చలకు రావాలని కార్మికులకు తెరాస ముఖ్య నేత  కేకే వినతి,గవర్నర్ తమిళ్ సై ను కలిసిన ఐకాసా నేతలు 
అక్టోబర్ 15 బాధ్యతో వ్యవహరించాలని కార్మికులకు, ప్రభత్వానికి జస్టిస్ ఆర్ ఎస్ చౌహన్,జస్టిస్ అభిషేక్ ఠెడ్డి తో కూడిన ధర్మాసనం సూచన
అక్టోబర్ 16 ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేసీర్ సమీక్ష, హైకోర్టు  సూచన పై చర్చలు,ప్రత్యామ్యానాయ ఏర్పాట్లపై ఆదేశం 
అక్టోబర్ 17 సమ్మెపై ఆరా తీసిన గవర్నర్,రవాణా శాఖ కార్యదర్శి నుండి వివరాల సేకరణ 
అక్టోబర్ 18 రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన ఐకాస నేతలు,సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలు,చర్చలు త్వరిత గతిన జరపాలని హైకోర్ట్ సూచన        
అక్టోబర్ 19 ప్రశాంతగా సాగిన ఐకాస రాష్ట్ర బంద్,పలు చోట్ల నాయకుల అరెస్ట్ కంచంబాగ్ పోలీస్టేషన్ కు తరలింపు,విద్య ఉద్యోగ విద్యార్ధి ఆటో టాక్సీ నాయకుల మద్దతు,మరోసారి రాజకీయ నేతలతో భేటీ అవుతామని ఐకాస వెల్లడి 
అక్టోబర్ 20 కొనసాగిన సమ్మె ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని కాంగ్రెస్ వెల్లడి,ఐకాస నాయకుల వివిధ కార్యక్రమాల వెల్లడి 

మరింత సమాచారం తెలుసుకోండి: