క్రికెట్ ఆటలో ఏ బంతిక మ్యాచ్ ను  ఎటు మలుపు తిప్పుతుందో చెప్పలేం... బంతి బంతి ఉత్కంఠగా మారుతుంది. ఒకే బంతిలో విజయం సాధించిన మ్యాచ్ లు ఉన్నాయి... ఓకే బంతులు ఓటమిపాలైన మ్యాచ్ లు  కూడా ఉంన్నాయి . కాగా  కొన్నికొన్ని మ్యాచుల్లో జట్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తే...  ఇంకొన్ని మ్యాచ్ లలో  సరికొత్త చెత్త రికార్డులను చూస్తుంటాం . క్రికెట్ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు ఊహించలేం . ఇక్కడ ఇలాంటి మ్యాచ్ జరిగింది. ఓ జట్టు భారీ స్కోరు సాధించి సరికొత్త రికార్డు సృష్టిస్తే...  ఇంకో జట్టు  కేవలం 10 పరుగులు కూడా సాధించలేకుండా  మరో రికార్డు సాధించింది . 11 మంది క్రికెట్ ప్లేయర్స్ కేవలం  ఏడు పరుగుల ఎక్స్ ట్రాల  రూపంలో సాధించిన డకౌట్ అయ్యారు .ఈ మ్యాచ్ గురించి తెలియాలంటే స్టోరీ లోకి వెళ్ళాల్సిందే . ముంబైలో జరిగిన ఇంటర్ స్కూల్ మ్యాచ్లో ఈ షాకింగ్ గణాంకాలు  నమోదయ్యాయి. ముంబైకి చెందిన స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్  చిల్డ్రన్స్ వెల్ఫేర్ స్కూల్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ కు  దిగిన స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 39 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఏకంగా 761 పరుగులు చేసింది. ఈ జట్టులో  ఒక ప్రేయర్ ఏకంగా 118 బంతుల్లో  338 పరుగులు  సాధించి సరికొత్త రికార్డులు సృష్టించారు. 

 

 అయితే  భారీ ఛేదన లక్ష్యంతో బ్యాటింగ్ కు  దిగిన చిల్డ్రన్స్ వెల్ఫేర్ స్కూల్ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. అత్యంత చెత్త ప్రదర్శన చేసి రికార్డు సృష్టించింది. కేవలం 7 పరుగులు చేసి ఆలౌటైంది. అయితే ఈ జట్టులోని 11 మంది సభ్యులు అందరూ డకౌట్ గా  నిలిచారు . ఆ 7 పరుగులు ఎక్కడివి  అనుకుంటున్నారా అవి కూడా ఎక్స్ ట్రాల  ద్వారా వచ్చినవి . ప్రస్తుతం ఈ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఈ మ్యాచ్ లో  ఒక జట్టు భారీ స్కోరు నమోదు చేసి రికార్డు సృష్టిస్తే... ఇంకో జట్టు అసలు స్కోరు నమోదు చేయకుండా రికార్డు సృష్టించింది. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఓటమే ఇది. 

 

 నెటిజన్లు  కూడా దీనిపై  భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి రికార్డ్ నేనెప్పుడూ చూడలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒక్క పరుగు  కూడా చేయకుండానే సరికొత్త రికార్డు సృష్టించారు అంటూ కామెంట్స్  పెడుతున్నారు . ఏదిఏమైనా క్రికెట్ మ్యాచ్ అన్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో మాత్రం అస్సలు ఊహించలేం . ఇక్కడ అదే జరిగింది... ఆ మ్యాచ్ ఆడిన ప్లేయర్స్ కూడా ఊహించి ఉండరు అందరూ డకౌట్ అయ్యి  ఎక్స్ ట్రాలతో  7 పరుగులు చేస్తామని. ఏదేమైనా ఈ మ్యాచ్ మాత్రం క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: