ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ఏపీలో ఇప్పుడు మంత్రి కొడాలి నాని ని ల‌క్ష్యంగా చేసుకుని టీడీపీ నేత‌లు చంద్రబాబు, లోకేష్‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు నాని ప్ర‌తివిమ‌ర్శ‌లు చేశారు. బాబోరి వ్య‌వ‌హ‌రంపై నాని చేసిన విమ‌ర్శ‌లు ఇప్పుడు ఏపీలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. గ‌త రెండుమూడు రోజులుగా మంత్రి నానికి, టీడీపీ నేత చంద్రాలుకు, లోకేష్‌కు మ‌ద్య మాటల యుద్దం జ‌రుగుతుంది. ఈ యుద్దంతో ఏపీలో రాజ‌కీయం వేడెక్కింది. 40ఏండ్ల రాజ‌కీయ సీనియ‌ర్‌గా చెప్పుకునే చంద్రాలు నానితో పెట్టుకుని ఇబ్బందుల పాల‌వుతున్నాడు. నాని మాట‌ల వాగ్ధాటికి చంద్రాలు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. 

 

నాని ల‌క్ష్యంగా చేసుకుని చంద్రాలు విమ‌ర్శ‌లు చేస్తే నాని చంద్రాలును, లోకేష్‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడు. ఏకంగా ఈ రోజు విజ‌య‌వాడ‌లో నాని చంద్రాలుపై దుమ్మెత్తి పోశారు. చంద్రాలు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం అల్లుడిగా చేసుకుని మామ‌కే వెన్నుపోటు పొడిచాడ‌ని విమ‌ర్శించి బాబోరి ప‌రువు బ‌జారున పెట్టారు. అంతే కాదు వెన్నుపోటు రాజ‌కీయాల్లో చంద్రాలును మించినోరు లేర‌ని దుమ్మెత్తిపోశారు  నాని. బాబోరిని ఎంత‌గా నాని విమ‌ర్శించాడంటే చంద్రాలుకు తిరుప‌తి ల‌డ్డుకు, మ‌ద్యం రేటుకు తేడా తెలియ‌ని నేత‌గా అభివ‌ర్ణించ‌డం విశేషం. 

 

బాబోరు ఎంత దౌర్బ‌గ్య స్థితిలో ఉన్నాడంటే.. తాను ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచిన వ్య‌క్తితోనే విమ‌ర్శ‌ల‌కు గురి కావ‌డం అంటే అది చంద్రాల‌కు ఆత్మ‌హ‌త్యా స‌దృశ్య‌మే అవుతుంది. ఏకంగా చంద్రాలును 70ఏండ్ల వ‌య‌స్సున్న రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త లేని నేత‌గా విమ‌ర్శించారు. దేవుడిని విమ‌ర్శిస్తే బాబోరికి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని నాని అంటున్నాడంటే... చంద్రాలు ప‌రిస్థితి ఎంత దీనంగా త‌యారైందో తెలుస్తుంది. చంద్రాలు ఇచ్చే ఐదు, ప‌దివేలు ఇస్తే ప్రెస్‌మీట్లు పెట్టె స‌న్నాసులు సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం విడ్డూరంగా ఉంద‌ని నాని బాబోరితో పాటు ఆయ‌న అనుంగ శిష్యుల‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టాడు. చంద్రాలు ద‌గ్గ‌ర ఉన్న‌వారంతా అంబోతులు అని విమ‌ర్శించి నాని త‌న దూకుడు ను ప్ర‌ద‌ర్శించారు. 

 

చంద్రాలును ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో ఓడించినా,  పాతాళంలోకి ప‌డేసినా ఇంకా బుద్ది రాలేద‌ని దుయ్య‌బ‌ట్టారంటే నాని ఎంత‌గా కోపంతో ఈ ప్రెస్‌మీట్ పెట్టారో తెలుస్తుంది. నాని చంద్రాలుతో పాటు లోకేశాల‌ను ప‌ప్పుగా అభివ‌ర్ణించారు. అస‌లు మంగ‌ళ‌గిరిలో గెల‌వ‌లేని లోకేషాలు లోకాన్ని ఏలుతాన‌ని గొప్ప‌ల‌కు పోతున్నాడ‌ని విమ‌ర్శించారు. లోకేషాలుకు రాజ‌కీయ అవగాహ‌న లేకుండా రాజ్యం ఎలా ఏలుతాడ‌ని నాని ఎద్దేవా చేసి అటు బాబోరిని, ఇటు లోకేషాల‌పై దుమ్మెత్తి పోశారు. ఏపీ మంత్రి నాని జోలికి పోతే.. ఎంత‌లా దుమ్మెత్తిపోస్తారో ఇప్పుడు చంద్రాలు, లోకేషాల‌కు అర్థ‌మ‌యిన‌ట్లు ఉంది. ఇంకోసారి ఎప్పుడైనా నానితో పెట్టుకోకుండా గ‌ట్టి బుద్ది చెప్పాడు బాబోరు, లోకేషాలుకు.

మరింత సమాచారం తెలుసుకోండి: