లక్షల కోట్లు వెచ్చించి అమరావతి రాజధాని కట్టే స్తోమత తమ ప్రభుత్వానికి లేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తేల్చి చెప్పారు. రాజధాని అంటే స్వతహాగా ఏర్పడాలని.. ఆయన అన్నారు. హైదరబాద్, చెన్నై, కోల్ కతా వంటి నగరాలు ఒక్క సంవత్సరంలో ఏర్పడలేదని.. వందల ఏళ్ల తర్వాత ఈ రూపంలో ఉన్నాయని బుగ్గన వివరించారు.

 

లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనం వెచ్చించి ఇప్పుడు రాజధాని కట్టే పరిస్థితిలో లేమని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు ఏపీకి కావాల్సింది మంచి పరిశ్రమలు, విద్యా, వైద్యం సౌకర్యాలేనని .. అవే తమ ప్రాధాన్యమని ఆయన తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం రాజధాని పేరుతో వందల కోట్లు దోచుకుందని బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అన్నారు.

 

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా డబ్బు ఆదా అయితే మంచిది కాదా? అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రశ్నించారు. ప్రజాధనం ఆదా అవుతుంటే సంతోషించాల్సింది పోయి విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు. పోలవరంపై ప్రతిపక్షం విమర్శలకు బుగ్గన కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు ఏమాత్రం మారలేదని, అతని బోధలు మారలేదని సినిమా పాటను వినిపించారు. హైదరాబాద్‌లో మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడారు.

 

పోలవరంకు కొత్త ఏజెన్సీ ఎలా వచ్చిందని, ఇదే ఏజెన్సీ ఎల్‌2లో ఉన్నారని, అప్పుడు చేయనిది ఇప్పుడేందుకు చేస్తున్నారని, కాళేశ్వరంలో ఇదే ఏజెన్సీ ఎక్కువ రేట్లకు చేస్తుందని, పోలవరంలో ఎలా చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారని గుర్తు చేశారు. సేప్టీ యాక్సేప్ట్‌ చేశారా అని మమ్మల్ని ప్రశ్నించారని తెలిపారు. 2014 నుంచి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను రక రకాలుగా మార్చుకుంటూ వచ్చారన్నారు. పాతరేట్‌ కంటే తక్కువ రేటుకు రివర్స్‌ టెండరింగ్‌లో వైయస్‌ జగన్‌ పోలవరాన్ని చేపడుతుంటంతో చంద్రబాబు అక్కసుతో మాట్లాడుతున్నారని విమర్శించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: