ఆంధ్ర ప్రదేశ్ ప్రశాంతంగా ఉంది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఆరు నెలల వ్యవధిలోనే ప్రజలకు తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. మరో వైపు కొత్త నాయకత్వంతొ కొత్త ఆలోచనలతో వ్యవస్థలను దారిన పెట్టే ప్రయత్నం జరుగుతోంది. అనుకున్న పనిలో తడబాటు ఉంటోంది తప్ప పొరపాటు మాత్రం ఎక్కడా లేదని అంతా చెప్పగలరు. 

 

మరి ఏపీలో పాలన ఈ విధంగా సాగుతుంటే బీజేపీలో కొత్త పూజారులు గుండెలు ఎందుకు బాదుకుంటున్నారో అర్ధం కావడం లేదు. చంద్రబాబు నాయుడుకి అయితే ఏపీలో ఏం జరుగుతుందో అర్ధం కావడంలేదుట. రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయిందట. ఏపీని తలచుకుంటే భయం వేస్తోందట. మరి బాబు ఎందుకు ఇంతలా కలవరపడుతున్నారో తమ్ముళ్లే చెప్పాలి. ఆరు నెలల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని బాబు జగన్ని ఆడిపోసుకుంటున్నారు.


మరో వైపు బీజేపీలో కొత్తగా చేరిన సుజనా చౌదరి ఏపీ దశ దిశా ఏమీ లేకుండా సాగుతోందని మధనపడుతున్నారు. ఏపీని రక్షించుకుంటామని శపధాలు చేస్తున్నారు. అసలు ఏపీకి ఏమైందో ఎవరూ చెప్పడంలేదు. నిజానికి ప్రశాంతంగా ఉన్న ఏపీలో అశాంతి రేపైనా రాజకీయాలు చేయాలనుకుంటున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా ఇదే విషయాన్ని ప్రశ్నించారు.  ఏపీలో మత సంఘర్షణలకు  విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో ఇతర మతాలకు రాయితీలు ఇస్తున్నారు, హిందువులకు ఎందుకు ఇవ్వరని సుజనా చౌదరి  ప్రశ్నిస్తున్నారు. నిజానికి చంద్రబాబు కూడా ఇలాంటి రాయితీలు ఇచ్చిన సంగతిని ఆయన మరచినట్లుగా ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక ఏకంగా అమరావతిలో పెద్ద చర్చి కట్టిస్తానని, వంద కోట్లతో దాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు నాడు టీడీపీలో ఉన్న చౌదరి గారు మరచినట్లుగా ఉన్నారని సెటైర్లు  పడుతున్నాయి. ఏదో విధంగా ఏపీలో గొడవలు తేవాలని, రాజ్యాంగ సంక్షోభం స్రుష్టించాలని విపక్షాలు ప్ర‌యత్నం చేస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారంటే అర్ధం చేసుకోవాలేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: