చంద్రబాబు హయాంలో విశాఖ పట్నంలో లులూ గ్రూప్ పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చింది. ఆ సంస్థకు చంద్రబాబు సర్కారు విశాఖలోని కమర్షియల్ ఏరియాలో స్థలం అప్పగించింది. ఈ సంస్థను తాను చాలా కష్టపడి ఒప్పించానని చంద్రబాబు చెప్పుకుంటారు. అయితే ఆ సంస్థ ఐదేళ్లలో పనే ప్రారంభించ లేదు. జగన్ సర్కారు వచ్చాక ఆ వ్యవహారాన్ని బయటకు తీసింది. ఫైళ్లనీ తిరగేస్తే కళ్లుబైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూశాయట.

 

విశాఖపట్నంలో లూలూ గ్రూప్ కు గత ప్రభుత్వం ఇచ్చిన భూమి వ్యవహారం వల్ల 500 కోట్ల నష్టం వాటిల్లుతుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. అందువల్లే ఆ ఒప్పందం రద్దు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక లూలూ గ్రూప్ కు ఇచ్చిన భూమి వివాదంలో ఉందని ఆయన చెప్పారు. అలాంటి భూములను గత ప్రభుత్వం లూలూ సంస్థకు కేటాయించిందన్నారు.

 

విశాఖలో కేవలం కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు మాత్రమే లూలూ గ్రూపు ముందుకొచ్చిందని, దానిని ప్రభుత్వం కూడా నిర్మించుకోగలదని ఆయన చెప్పారు. మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు.

 

అయితే... మొదలేకాని లూలు కంపెనీ భూమి కేటాయింపులు రద్దు చేయడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేశారు. పైగా అది కన్వెన్షన్ సెంటర్ . దానికోసం ఆయన చాలా సందప్రదింపులు చేసి పెట్టుబడులు తీసుకు వచ్చారట. నిరంతరం వెంటబడి లులూ గ్రూప్ ఎపిలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పించామని ఆయన ట్విట్టర్ లో అన్నారు.

 

భూ వివాదాలు, ప్రభుత్వానికి 500 కోట్ల ఆదాయం నష్టం వస్తుందని లూలూ భూ కేటాయింపులు రద్దు చేశామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుతో విశాఖలో వేల ఉద్యోగాలు రావడంతో పాటు స్థానికంగా ఆర్థికాభివృద్ధి జరిగేదనిఅన్నారు. ముఖ్యమంత్రి జగన్ తెలివితక్కువ నిర్ణయాలతో తమ శ్రమంతా వృథా అయిందని అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: