సమాజంలో ఎక్కడ చూడు నేరాలకు కొదువలెకుండా పోతుంది. మానవత్వాన్ని మరచి మనిషి జీవించడం నేర్చుకుంటున్నాడు. తల్లి, చెల్లి అనే తేడా లేకుండా అసలు తానొక మనిషిని అనే సృహ లేకుండా నేరలోకంలో మృగమై సంచరిస్తున్నాడు. ఇక్కడొక వ్యక్తి ఎంత దారుణం చేసాడంటే కన్న తల్లినే కడ తేర్చాలని చూసాడు. ఉగ్గుపాల బంధాన్ని మరచి కసాయిలా మారాడు. తప్పడడుగులు వేయకుండా పట్టుకున్న తల్లి ఊపిరినే ఆపేయాలని సంకల్పించాడు.

 

 

ఇలాంటి కొడుకు ఇంటికొక్కడుంటే చాలు ముందు ముందు తల్లులు పిల్లల్ని కనడం మానేస్తారేమో అనేలా ప్రవర్తించిన ఈ రాక్షసుడి పేరు ప్రశాంత్‌(25). ఇక వివరాలు తెలుసుకుంటే. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో తన కడుపు మాడ్చుకుని కాయకష్టం చేసి కొడుకుని, కూతురిని పోషించుకుంటున్న సంధ్యారాణి (45) అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తోంది...

 

 

తండ్రి లేని బిడ్డని గారాబం చేస్తే తాగుడుకు బానిసయ్యాడు ఈ కర్కోటకుడు.. తనకు మద్యం కోసం డబ్బివ్వలేదని, తనకు పెళ్లి చేయాలనే ఉద్దేశ్యం తల్లికి లేదనే అనుమానంతో ఆమె మీద ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. చోటు చేసుకుంది. కాలనీవాసులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సర్‌సిల్క్‌ ఎఫ్‌-కాలనీకి చెందిన సంధ్యారాణి-ప్రభాకర్‌ దంపతులకు కుమార్తె శ్వేత, కుమారుడు ప్రశాంత్‌ ఉన్నారు. అనారోగ్యంతో పదేళ్ల కిందటే భర్త ప్రభాకర్‌ మృతిచెందగా.

 

 

సంధ్యారాణి తన రెక్కల కష్టంతో ఆరేళ్లకిందటే కుమార్తెకు వివాహం చేసింది. ఇక జులాయిగా తిరుగుతున్న  ప్రశాంత్‌ మద్యం, గంజాయికి బానిసయ్యాడు. డబ్బులు కావాలంటూ తల్లితో నిత్యం కొట్లాడేవాడు. ఇటీవల తనకు పెళ్లి చేయాలని వేధిస్తుంటే.. ముందు తాగుడు మానేయమని తల్లి సముదాయించింది. ఈ క్రమంలో 19న తన తల్లికి వచ్చిన వితంతు పింఛను డబ్బు ఇమ్మంటూ ప్రశాంత్‌ గొడవపడ్డాడు.

 

 

ఆ డబ్బులతో ఉన్న అప్పుతీర్చానని తల్లి చెప్పడంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. బుధవారం రాత్రి తాగి ఇంటికొచ్చిన ప్రశాంత్‌ గురువారం తెల్లవారుజామున తల్లి నిద్రిస్తుండగా ఆమె గొంతు కోశాడు. ఛాతీ, ఉదర భాగాల్లో పొడిచాడు. ఆమె అరుపులకు ఇరుగుపొరుగు వచ్చి తలుపు తట్టగా. తలుపులు తీసుకుని పరారయ్యాడు.

 

 

అప్పటికే రక్తపు మడుగులో ఉన్న సంధ్యారాణిని  కాలనీవాసులు స్థానిక ఆసుపత్రికి, తరలించగా మెరుగైన చికిత్స కోసం సంధ్యారాణిని హైదరాబాద్‌కు పంపించారు. బాధితురాలికి ప్రాణహాని లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈ ఘటన స్దానికంగా సంచలనం సృష్టించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: