మరో 40రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. 2019 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 2020 సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్ కె జోషి గవర్నర్ తమిళి సై ఆదేశాల ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెలలో 1వ తేదీన నూతన సంవత్సరం, జనవరి 14, 15 తేదీలలో భోగి మరియు సంక్రాంతి సెలవులుగా ప్రకటించారు. 
 
ఫిబ్రవరి 21వ తేదీన మహాశివరాత్రి సెలవుగా ప్రకటించారు. మార్చి నెలలో 9వ తేదీన హోళి, 25వ తేదీన ఉగాది సెలవులుగా ప్రకటించారు. ఏప్రిల్ నెలలో 2వ తేదీన శ్రీరామనవమి, 10వ తేదీన గుడ్ ఫ్రైడే, 14వ తేదీన అంబేద్కర్ జయంతి సెలవులుగా ప్రకటించారు. మే నెల 25,26 తేదీలలో రంజాన్ పండుగ సందర్భంగా సెలవులుగా ప్రకటించారు. జూన్ నెలలో సెలవులు లేకపోవటం గమనార్హం. 
 
జులై నెల 20వ తేదీన బోనాలు సెలవుగా ప్రకటించారు. ఆగష్టు నెలలో 1వ తేదీన బక్రీద్, 11వ తేదీన కృష్ణాష్టమి, 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం, 22వ తేదీన వినాయక చవితి సెలవులుగా ప్రకటించారు. సెప్టెంబర్ నెలలో సెలవులు లేకపోవడం గమనార్హం. అక్టోబర్ నెలలో 2వ తేదీన గాంధీ జయంతి, 17వ తేదీన బతుకమ్మ ప్రారంభోత్సవం, 24వ తేదీన దుర్గాష్టమి, 30వ తేదీన మిలాద్ ఉన్ నబీ సెలవులుగా ప్రకటించారు. నవంబర్ నెలలో 30వ తేదీన కార్తీక పౌర్ణమి సెలవుగా ప్రకటించారు. డిసెంబర్ నెల 25వ తేదీన క్రిస్మస్ సెలవుగా ప్రకటించారు. 
 
ఆదివారం రోజున జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం, ఏప్రిల్ 5వ తేదీన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, ఆగస్టు 30వ తేదీన మొహర్రం, అక్టోబర్ 25వ తేదీన విజయదశమి సెలవులుగా ప్రకటించారు. రెండో శనివారం నవంబర్ 14వ తేదీన దీపావళి పండుగ సెలవుగా ప్రకటించారు. జనవరి 1వ తేదీన కొత్త ఏడాది సందర్భంగా సెలవు ప్రకటించినందున ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి 8వ తేదీన రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రభుత్వం ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: