దాదాపుగా చాలమందికి డాక్టర్లు రాసిన మందుల పేర్లు అర్ధం కావు. అతను ఇచ్చిన చీటిని తీసుకెళ్లి మందుల షాపులో ఇవ్వగా ఆ షాపు అతను ఆ చీటిలో ఉన్న మందులు ఇస్తున్నాడా లేక వేరే మందులైవైన ఇస్తున్నారా అనే విషయం అర్ధం కాదు. షాపు అతన్ని అడిగితే ఏదో సమాధానం చెప్పి పంపిస్తాడు. ఇలాంటి ఇబ్బంది చాల మందికి చదువుకున్న వారికి గాని చదువు రాని వారికి గాని ఎదురవుతుంది. ఇలాంటి సమస్య ఇక నుండి ఉండదని తెలంగాణ ప్రభుత్వం అంటుంది.

 

 

ఎందుకంటే ఈ సమస్య పరిష్కారానికి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే ఇకనుండి మందులపై ఇంగ్లీష్ అక్షరాలతో పాటుగా ఆ మందు పేరును తెలుగు అక్షరాల్లో రాయాలనే షరతుని విధించింది. ఇక సాధారణంగా ఆంగ్లంలో ముద్రించే మందుల పేర్లను గుర్తించడంలో చదువున్న వారు సైతం తడబడతారు. అంతగా అక్షరజ్ఞానం లేనివారు, తెలుగు అక్షరాలనే చదవగలిగినవారు, ముఖ్యంగా సర్కారు దవాఖానాలకొచ్చే నిరుపేదలకైతే.. ఔషధాల పేర్లను అర్థం చేసుకోవడం అసాధ్యమే.

 

 

వైద్యుడు రాసిందేమిటో తెలియదు.. ఫార్మాసిస్టు ఏమిస్తున్నాడో గుర్తించలేరు.. ఏ మందును ఎంత మోతాదులో ఎన్నాళ్లు వాడాలో కూడా అర్థం కాదు.. ఎందుకంటే మందుల పేర్లన్నీ ఆంగ్లంలోనే ఉంటాయి! సర్కారు దవాఖానాలకు వచ్చే రోగుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం..ఈ దుస్థితిని రూపు మాపడానికి అడుగు ముందుకేసింది.. ఆయా ఆసుపత్రుల్లో రోగులకు అందజేసే ప్రతి ఔషధంపైనా తెలుగులోనే పేరుండేలా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

 

 

ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పరిశీలిస్తే. ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేస్తున్న అన్ని రకాల ఔషధాలపై ఆంగ్లంతో పాటు తెలుగులోనూ మందుల ‘జనరిక్‌’ పేర్లను ముద్రించాలని నిర్ణయించింది. ఈ ఒప్పందంలోనే కీలక మార్పులు ఎంటంటే కంటికి కనిపించేలా పెద్దక్షరాలతో, స్పష్టంగా పేర్లను ముద్రించి సరఫరా చేయాలని తెలిపింది..

 

 

ఇదే కాకుండా మందులను ప్యాకింగ్‌ చేసేటప్పుడే బ్యాచ్‌ నంబరు, ఉత్పత్తి తేదీ, గడువు ముగింపు తేదీ, నాణ్యత, సంస్థ పేరు తదితర సమాచారాన్ని ‘బార్‌ కోడింగ్‌’ రూపంలో తెలియజేసేలా నిబంధనలు విధించారు. ఒకవేళ మందుల సరఫరా ఇలా జరుగని పక్షంలో ఆ ఔషధాలను తిరస్కరిస్తారు. ఇక ఒకే సరఫరాదారు రెండు అంతకన్నా ఎక్కువ మందులను సరఫరా చేస్తుంటే.. ఆ మందులపై అక్షరాల ముద్రణ ఒకే రంగులో ఉండరాదు. ఎందుకంటే రోగి వాటిని గుర్తించడంలో పొరపడే అవకాశం ఉంటుందనే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విధానం వల్ల ఎవరైన తేలిగ్గా మందులు గుర్తించవచ్చూ.

మరింత సమాచారం తెలుసుకోండి: