ఆర్టీసీని నడపటం తమ వల్ల కాదని కేసియార్ చేతులెత్తేశారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ. 640 కోట్లు అవసరం అవసరం అవుతుందని సిఎం స్పష్టం చేశారు. ఇంత మొత్తం ఖర్చు చేసే స్తోమత సంస్ధకు లేదని కేసియార్ తేల్చి చెప్పేశారు.  ప్రతినెల వందల కోట్ల రూపాయలు సంస్ధకు  ఇచ్చేంత సీన్  తమ ప్రభుత్వానికి కూడా లేదని చెప్పేశారు. అంటే సంస్ధను ఏమి చేయదలుచుకున్నారో పరోక్షంగా చెప్పేశారు.

 

చార్జీలు పెంచి కొంత ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉన్నా చార్జీలు పెంచితే జనాలెవరూ బస్సులెక్కరని కూడా సిఎం అభిప్రాయపడ్డారు. ఎంతోకొంత సహాయం చేసి సంస్ధను నడుపుదామని అనుకున్నా ఎంతకాలం చేయాలో అర్ధం కావటం లేదన్నారు. పరిస్దితులన్నింటినీ గమనిస్తే సంస్ధను యథాతధంగా నడపటం మాత్రం సాధ్యం కాదని కేసియార్ ఫైనల్ చేసేశారు.

 

ఇటువంటి పరిస్ధితుల్లో సంస్ధ రూట్లను ప్రైవేటీకరించటమే ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గంగా చెబుతున్నారు. అందుకనే ఇప్పటికే 5100 మార్గాలను ప్రైవేటీకరించినట్లు చెప్పారు. అంటే ఇదే అంశంపై ఈరోజు హైకోర్టు తన అభిప్రాయాన్ని చెప్పబోతోంది లేండి.

 

ప్రగతి భవన్లో కేసియార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులు గంటల తరబడి సంస్ధ భవిష్యత్తుపై చర్చలు జరిగాయి. సమావేశంలో బయటడపిన లెక్కల ప్రకారం సంస్ధకు ఇప్పటికే రూ. 5 వేల కోట్ల అప్పులున్నాయట. తక్షణమే చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలు కలిపి రూ. 2 వేల కోట్లున్నాయట.  సిబ్బందికి  సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వటానికే సుమారు రూ. 240 కోట్లు అవసరమట. సెప్టెంబర్ నెలకు రూ. 240 కోట్లు అవసరమంటే మరి అక్టోబర్, నవంబర్ జీతాల మాటేమిటి ?

 

రెండేళ్ళుగా రవాణా పన్ను బకాయిలు పేరుకుపోయాయట. కొంతకాలంగా డీజల్ పన్ను కూడా చెల్లించలేకపోతోందట. చెల్లించాల్సిన పిఎఫ్ బకాయిలే ఇప్పటికి నెలకు రూ. 70 కోట్లకు చేరిందట. వేల కోట్ల రూపాయల ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయిన సంస్ధను నడపటం ప్రభుత్వానికి కష్టం కాబట్టి  ప్రైవేటుపరం చేయటమొకటే మార్గంగా కేసియార్ డిసైడ్ చేశారు. కోర్టు తీర్పు ఎలాగున్నా సంస్ధను ప్రైవేటుపరం చేసేయటం మాత్రం ఖాయమని  అర్ధమైపోతోంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: