తిరుమల వివాదం పై అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తిరుమల ఆలయాన్ని నీ అమ్మ మొగుడు కట్టించాడా? అంటూ ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అభ్యంతరం చేయగా కొడాలి నాని కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. 

హిందూ సంప్రదాయాలను అవమానిస్తున్నారంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. తాను చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్నారు నాని.  తిరుమల డిక్లరేషన్ విషయాన్ని ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ "తిరుమల ఆలయంలోకి వెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. జగన్ తిరుమల ఆలయానికి వెళ్లడం ఇప్పుడేమీ కొత్త కాదన్నారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చాలా సార్లు తిరుమలకు వెళ్లారని చెప్పారు. 

అప్పుడు అధికారం లో టీడీపీ సర్కార్ ఉంది ఇక అప్పుడు రాని డిక్లరేషన్ ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గుర్తు కు వచ్చిందా అని చంద్రబాబు పై ఫైర్ అయ్యారు నాని. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే బీజేపీ సభ్యత్వం కానీ టీడీపీ సభ్యత్వమైనా తీసుకోవాలంటారేమోనని ఎద్దేవా చేశారు. లేదంటే కమ్మ కులంలో పుడితేనే వెంకన్నను దర్శించుకోవాలా? అని ప్రశ్నించారు. తిరుమల వెంకన్న చౌదరి అంటూ టీడీపీ నేత మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. చంద్రబాబుకు హిందూ సంప్రదాయాలపై అంత గౌరవం ఉంటే తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూని మద్యం ధరలతో ఎలా పోలుస్తారని మంత్రి నాని ప్రశ్నించారు. మద్యం ధరలకు.. లడ్డూ ధరలకు ఏంటి సంబంధమని నిలదీశారు అవకాశవాద రాజకీయాలు చెయ్యొద్దని చంద్రబాబు కు చురకలు అంటించారు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని గురించి తప్పుగా మాట్లాడనని నాని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: