గత 47 రోజులుగాఆర్టీసీ కార్మికులు సమ్మె జరుపుతున్నారు సమ్మె గురించి ముఖ్యమంత్రి .చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో గురువారం ఆర్టీసీపై ఉన్నతస్థాయి సమావేశం జరిపారు దాదాపు   నాలుగు గంటలు పైగా జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ లో  ప్రస్తుతం నెలకొన్న    పరిస్థితుల నేపథ్యంలో    ఆ పరిస్థితుల నుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎలా బయటపడాలి  దానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన  నివారణ చర్యలు  ఏంటి అనే అంశంపై విస్తృత చర్చ జరిగింది.

 

టీఎస్ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, న్యాయస్థానంలో నిర్ణయాలు, నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది.వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే ప్రథమ కర్తవ్యంగా ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

 

రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉందని, అప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించినట్లు ఇప్పటికే ఆర్టీసీ ఫై ఉన్న అప్పులు, బకాయిలు, సీసీఎస్‌కు ఇవ్వాల్సిన మొత్తం, కొత్త బస్సులకు అయ్యే ఖర్చు, పీఎఫ్ బకాయిలు, ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి చెల్లించాల్సిన మొత్తం జీతం వీటి  అన్నిటిపై ప్రభుత్వం లెక్కలు వేసింది.

 

 

 ఏ లెక్కల  తర్వాత "మొత్తంగా ఇప్పుడున్నట్లు ఆర్టీసీని నడపాలంటే నెలకు దాదాపు రూ.640 కోట్లు కావాలి, ఈ భారమంతా ఎవరు భరిస్తారు ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వానికి కూడా భరించే పరిస్థితి లేదు. ఎంతోకొంత ప్రభుత్వ సాయం చేసినా అది ఎంతవరకు నిలబడగలుగుతుంది" అని అభిప్రాయపడింది..

 

 

ఇక "ఆర్టీసీకి ముందున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం, చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని యథాతథంగా నడపడం సాధ్యం కాదు" అనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: