మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు షాక్ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో గతంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఒకరు ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాలకు హాజరు కావటం లేదు. మీడియాలో ఆ మంత్రి గురించి హడావిడి లేదు. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో కీలకంగా వ్యవహరించిన ఆ మంత్రి ఈ మధ్య కాలంలో కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. 
 
2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఓటమి పాలైన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓటమి తరువాత కొంతకాలం హడావిడి చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు జిల్లా అధ్యక్షునిగా రెండుసార్లు పని చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా టీడీపీ పార్టీలో ముఖ్య పాత్ర పోషించారు. 
 
2019 ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు చురుగ్గా పాల్గొన్నారు. జిల్లా సమన్వయ కమిటీ సమావేశాల్లో పాల్గొనటంతో పాటు పార్టీ బలోపేతం దిశగా ప్రత్తిపాటి పుల్లారావు చర్యలు చేపట్టారు. కానీ కోడెల శివ ప్రసాద్ మరణం తరువాత పార్టీ వ్యవహారాలకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దూరంగా ఉంటున్నారు. 
 
అవినాష్, వంశీ వంటి నేతలు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నా ప్రత్తిపాటి పుల్లారావు ఆ విమర్శల గురించి స్పందించటం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్న ప్రత్తిపాటి త్వరలో బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో ప్రత్తిపాటి పార్టీ మారాలా...? వద్దా...? అనే విషయం గురించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. మరి ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ మారే విషయం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: