ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్న యువ ముఖ్యమంత్రి తాజాగా అవినీతిపై నిరోధం పై కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై అధ్యయనం, సిఫార్సుల కోసం అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రజా విధానాల బృందం ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణస్వామి, రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ చీఫ్‌ విశ్వజిత్‌ సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడాన్ని తమ సంస్థకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణస్వామి పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో తమ పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతోంది? ఎక్కడ ఆస్కారం ఉంది? దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి?.. ఇలాంటి అంశాలపై ఐఐఎం అహ్మదాబాద్ సమగ్రంగా పరిశీలించనుంది. గతంలో ఏది కావాలన్నా ప్రజలు మండల కార్యాలయాలకు వెళ్లేవారని అక్కడ పనులు కాని పరిస్థితులు నెలకొనడంతో అవినీతి, పక్షపాతం, వివక్షకు ఆస్కారం ఏర్పడిందన్నారు. అందుకనే అధికార వికేంద్రీకరణ, గ్రామాలకు అందుబాటులో పాలన, ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల గడపకే చేర్చడం అనే లక్ష్యాలను సాధించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చామని సీఎం వివరించారు. అవినీతిపై యుద్ధం జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభం అవుతాయని, కంప్యూటర్లు, ఇతర సామగ్రి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ ప్రయత్నాలన్నీ పేదలు, సామాన్యులకు మంచి చేయడానికేనని పునరుద్ఘాటించారు. అవినీతి, పక్షపాతం లేకుండా అర్హులందరికీ మంచి జరగాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఇక పై ఏపీ లో అవినీతికి పాల్పడితే కఠిన శిక్షలు తప్పవంటూ జగన్ సర్కార్ చెప్పకనే చెప్పింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: