ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ బాగా పెరిగిపోయింది. కొంతమంది కేవలం గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి ఏళ్ళతరబడి కష్టపడుతుంటారు. ఉన్నత చదువులు చదివినప్పటికీ చిన్న గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అనుకుని ఎలాంటి  గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్  వచ్చిన దానిని వదిలి పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కి ఉన్న రేంజ్  అలాంటిది మరి. పెద్ద పెద్ద చదువులు చదివినవారు కూడా చిన్న స్వీపర్ జాబ్ చేయడానికి కూడా వెనకాడరు. అందుకే ప్రభుత్వం నుంచి ఎలాంటి చిన్న ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలయినప్పటికీ కూడా దానికి కాంపిటీషన్ ఓ రేంజిలో ఉంటుంది. నోటిఫికేషన్ విడుదలైన ఉద్యోగాల కంటే 10, 20 రెట్లు ఎక్కువగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం పోటీపడి మరీ చదువుతుంటారు అభ్యర్థులు. 

 

 

 

 ఇక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల అయింది  అంటే చాలు హడావిడి  ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారే చిన్నచిన్న జాబులకు కూడా అప్లై చేస్తుండటంతో పదవ తరగతి ఇంటర్ చదివిన వాళ్ళు అయితే నిరాశ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పదవ తరగతి పాస్ అయిన వారికి ఒక శుభ వార్త చెప్పింది. ఇండియన్ నేవి  లో నాలుగువందల సెయిలర్  పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ నేవీ. ఈ విషయం  పదవ తరగతి పాసైన నిరుద్యోగులకు శుభవార్త అనే చెప్పాలి. 2020 బాచ్ గాను ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ నేవీ. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిసింది. కాగా ఈ నెల 28న ఉద్యోగాలు దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. 

 

 

 

 అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు పదవ తరగతి విద్యార్హత ప్రకటించింది ఇండియన్ నేవీ. అయితే అక్టోబర్ 2000 సంవత్సరం నుంచి సెప్టెంబర్ 2003 సంవత్సరం మధ్యలో జన్మించిన   వారికి మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అంటూ వెసులుబాటు కల్పించింది. అంతేకాదండోయ్ పెళ్లి కాని పురుషులకు  మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు అని ప్రకటించింది. కాగా  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఇండియన్ నేవీ అఫీషియల్ వెబ్ సైట్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే ఇది పదవ తరగతి పాసైన అభ్యర్ధులకు ఓ మంచి అవకాశం అని చెప్పాలి. కాగా  దరఖాస్తు గడువు ముగియకముందే దరఖాస్తు చేసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: