తెలుగుదేశంపార్టీ నుండి బిజెపిలోకి ఫిరాయించిన  కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సొల్లుకతలు చెబుతున్నట్లే ఉన్నారు. టిడిపి ఎంపిలతో పాటు వైసిపి ఎంపిలు కూడ తమతో టచ్ లో ఉన్నట్లు ఆయన చెప్పిన మాటలు సొల్లుకతలే అనిపిస్తోంది. టిడిపి నుండి వీలైనంతమంది ఎంఎల్ఏలను అవకాశం ఉంటే ఎంపిలను కూడా తమ పార్టీలోకి లాగేసుకోవాలని బిజెపి శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇందులో భాగంగానే అధికారం పోగానే సుజనాతో కలిపి నలుగురు రాజ్యసభ ఎంపిలు బిజెపిలోకి ఫిరాయించారు. తర్వాత నుండి ఎంఎల్ఏలను లాగేసుకోవటానికి కమలం నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కాకపోతే ఫిరాయింపుల వేటు పడుతుందన్న భయం వెంటాడుతోంది. ఫిరాయింపుల వేటు పడి ఉపఎన్నికలు వస్తే బిజెపి తరపున గెలవలేమనీ  బాగా తెలుసు. అందుకనే ఎంఎల్ఏలు బిజెపిలో చేరే  విషయంలో బాగా కన్ఫ్యూజన్ కనబడుతోంది.

 

వాస్తవం ఇలాగుంటే సుజనా మాత్రం మొత్తం 20 మంది ఎంఎల్ఏలూ తమతో టచ్ లో ఉన్నట్లు ఎకసెక్కాలాడుతున్నారు. టిడిపి తరపున 23 మంది గెలిస్తే 20 మంది టచ్ లో ఉన్నారంటే అర్ధమేంటి ? టచ్ లో లేని  మిగిలిన ముగ్గురు ఎంఎల్ఏలెవరు ? ఏదేమైనా టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించగానే సుజనా బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే అర్ధమైపోతోంది. ఎందుకంటే ఈ ఎంపి ప్రకటనలను బిజెపిలోని ఒరిజినల్ నేతలే పట్టించుకోవటం లేదు లేండి.

 

సరే టిడిపి ఎంఎల్ఏలు, ఎంపిలు టచ్ లో ఉన్నారంటే అర్ధముంది ? మరి వైసిపి ఎంపిలు ఎందుకు బిజెపితో టచ్ లో ఉన్నట్లు ? అంత అవసరం ఏమీ వైసిపి ఎంపిలకు లేదు. పార్టీ తరపున గెలిచిన ఎంపిల్లో అత్యధికులు జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్ట మీద గెలిచిన వారే. పార్టీ తరపున 22 మంది ఎంపిలు గెలిస్తే మొదటిసారి ఎన్నికల్లో పోటి చేసిన వారే 17 మంది. ఇటువంటి ఎంపిలు కూడా బిజెపితో టచ్ లో ఉన్నారంటే సుజనా చెబుతున్నది ఉత్త సొల్లుకతలే అనిపిస్తోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: