తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు చేయూతనిచ్చేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు పంట పెట్టుబడి సాయంగా ఐదువేల రూపాయలను అందించేందుకు నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ప్రతి రైతుకు ఎకరాకు 5 వేల రూపాయలు అందించేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిరుపేద రైతుల కోసం రైతు బంధు ప్రవేశపెట్టామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం...పేద  రైతులకు కేవలం అయిదు ఎకరాల లోపు మాత్రమే భూమి ఉంటుందని... కేవలం భూస్వాములకు మాత్రమే ఎక్కువ మొత్తంలో భూమి ఉంటుందని ఈ నేపథ్యంలో ఈ రైతుబంధు ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటూ  ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

 

 

 

 రెండెకరాలు  ఉన్న రైతులకు రైతు బందు ద్వారా  10000 తీసుకుంటుంటే... భూస్వాములు మాత్రం తమకు 100 ఎకరాలకు గాను లక్షల  రూపాయల వరకు రైతుబంధు పొందుతున్నారని.. ఇది కేవలం భూస్వాముల కోసమే ప్రవేశపెట్టిన పథకం అంటూ విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ ఈ విషయంపై ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. రైతులకు ఎకరాకి ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించేందుకు నిర్ణయించింది. అయితే గత కొంత కాలంగా రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లోకి జమ కావడం లేదు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇంకా రైతులకు రైతుబంధు చెల్లించలేదు ప్రభుత్వం. రైతుబంధు వస్తే తమకు కాస్తయినా చేయుత  దొరుకుతుందని ఆశ పడుతున్న రైతులకు నిరాశే మిగులుతుంది.

 

 

 

 ఈ క్రమంలో రైతు బంధు పథకం పై పరిమితులు విధించేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు గాను ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున రైతు బంధు అందుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో చెప్పింది. కానీ ఇప్పుడు ఆ నిబంధనను సడలిస్తూ కేవలం పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు చేయూతను అందించేందుకు వ్యవసాయ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ నుంచి సిఎం కార్యాలయానికి ఫైల్ వెళ్ళింది... కాగా  దీనిని పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ప్రస్తుతం ఖరీఫ్ బకాయిలతో పాటు ప్రస్తుత రబీ సీజన్లకు సంబంధించిన రైతుబంధు రుసుము చెల్లించాల్సి ఉండటంతో... ఈ ప్రతిపాదన తీసుకురాగా... దీన్ని  సమీక్షించి దాదాపు లక్ష మంది రైతులకు రైతుబంధు త్వరలో నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: