జగన్మోహన్ రెడ్డి కొట్టిన  దెబ్బకు తెలుగుదేశంపార్టీ కొమ్ము కాస్తున్న చాలామందికి కళ్ళు బైర్లు కమ్మటం ఖాయమేనా ? పార్టీలో ఇపుడిదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతున్నట్లు జగన్ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఈ నిర్ణయంపై చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు అండ్ కో తో పాటు మొత్తం ఎల్లోమీడియా అంతా నానా యాగీ చేస్తొంది. నిజానికి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామంటే వీళ్ళు ఇంత యాగీ చేయాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఈ నిర్ణయం పూర్తిగా విద్యార్ధులు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన విషయం.

 

ఒకవేళ ఈ విషయంలో ఫెయిల్ అయితే అది జగన్  ప్రభుత్వానికే చెడ్డ పేరొస్తుంది. అయినా కానీ చంద్రబాబు, వెంకయ్య, పవన్, ఎల్లోమీడియా ఎందుకంత గగ్గోలు పెడుతున్నారు ? ఎందుకంటే  వీళ్ళ గోల వెనక పెద్ద కతే ఉందట. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ళ మ్యనేజ్మెంట్లలో  అత్యధిక కమ్మోరి చేతుల్లోనే ఉన్నాయి. లేకపోతే టిడిపి వాళ్ళవే అయ్యుంటాయి.

 

ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం లేదు కాబట్టి ఇంతకాలం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళకే పంపుతున్నారు. అదే ఇంగ్లీషుమీడియంను ప్రభుత్వ స్కూళ్ళలోనే ప్రవేశపెడితే చాలామంది తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళకు పంపటం తగ్గిపోతుంది. తమ పిల్లలను  ప్రైవేటు స్కూళ్ళకు పంపాలంటే తల్లిదండ్రులు భారీగా ఫీజులు కడుతున్నారు.  

 

అదే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెడితే తల్లిదండ్రులకు రెండు విధాల లాభం. ఒకటి ప్రైవేటు స్కూళ్ళల్లో వేలకు వేల ఫీజులు కట్టాల్సిన అవసరం ఉండదు. రెండోది ప్రభుత్వమే తమకు అమ్మఒడి పథకంలో భాగంగా  ఏడాదికి రూ. 15 వేలు ఎదురు ఇస్తుంది. ఇప్పటికే అమ్మఒడి పథకంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్ధుల అడ్మిషన్లు ఒక్కసారిగా  పెరిగిపోయాయి.

 

ఇక దీనికితోడు ఇంగ్లీషుమీడియం కూడా ప్రవేశపెడితే అంతే సంగతులు. జగన్ నిర్ణయం వల్ల ప్రైవేటు మ్యానేజ్మెంట్లకు ఏడాదికి వందల కోట్ల రూపాయల ఆదాయం పడిపోతుందని అంచనా.  ఒక్కసారిగా తమ ఆర్ధికమూలాలు దెబ్బతినేస్తుందన్న ఆందోళనతోనే అందరూ కలిసి ఒక్కసారిగా జగన్ పై మండిపోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: