చంద్రబాబు అధికారానికి దూరం అయితే అసలు తట్టుకోలేడు. తన ఈర్ష్య .. అసహనం మొత్తం చూపిస్తారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ కనీసం 6 నెలలు కూడా కాలేదు. అప్పుడే బాబు గారు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని నానా హంగామా చేస్తున్నారు. పెట్టుబడులు వెళ్లి పోతున్నాయని తెగ భాద పడిపోతున్నారు. ప్రభుత్వం కుదుట పడి.. విధానపరమైన నిర్ణయాలు తీసుకొని.. తన పాలనను ప్రారంభించేందుకుఅవకాశం ఇవ్వటంతో పాటు.. ఏడాది పాటు మౌనంగా అధికారపక్షం వ్యవహరిస్తున్న తీరును గుర్తించి..తర్వాత విమర్శలు.. నిరసనలు.. ఆందోళనలు చేపట్టటం సాధారణంగా జరిగేదే.

 

అయితే చంద్రబాబు ఆరోపణల్లో పస లేదని అర్ధం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. అయితే వైసీపీ సర్కార్  అధికారంలోకి వచ్చి నెల రోజులు కాక ముందు నుంచే ఏపీ ప్రభుత్వం ఏదేదో చేస్తుందంటూ మీడియా ముందు ఉదరగొట్టటమే కాదు.. ప్రతి విషయాన్ని విమర్శించటమే ఎజెండాగా పెట్టుకున్న ఏపీ విపక్ష నేత చంద్రబాబు తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఏపీ సీఎం జగన్ తీరు కారణంగా ఏపీలో పెట్టుబడులు పెట్టటానికి ముందుకొచ్చిన  పలు కంపెీలు వెనక్కి వెళ్లిపోతున్నాయంటూ ఆయన తరచూ గుండెలు బాదుకోవటం తెలిసిందే. ఇలాంటివేళ.. ఆయన వాదనకు భిన్నమైన పరిణామం తాజాగా చోటు చేసుకుంది. ఏపీలో ఎలక్ట్రికల్ బస్సుల తయారీ యూనిట్ ను స్టార్ట్ చేసేందుకు వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది.



దీనితో అసలు పెట్టుబడులు వెనక్కి ఎందుకు పోతున్నాయో బాబు గారికే తెలియాలి. ఎన్నికల్లో జనాలు ఛీ కొట్టినా బాబు చీప్ ట్రిక్స్ ఇంకా చేస్తున్నారు. అంతేకాదు.. తమ కంపెనీని కరవు జిల్లా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తామని.. ఇందుకు 120 ఎకరాల భూమిని కేటాయించాలని కోరటం.. అందుకు ప్రభుత్వం ఓకే చెప్పేసింది. ఈ కంపెనీ ఏపీలో రూ.వెయ్యి కోట్ల మేర పెట్టబడులు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ కంపెనీ కారణంగా ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ 3వేల మందికి ఉపాధి లభిస్తుందన్న వాదన వినిపిస్తోంది. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన వీర వాహన్ ఉద్యోగ్ సంస్థకు సాధారణ ప్రోత్సహాకాలతో పాటు.. విద్యుత్.. నీటి సరఫరాలోనూ సబ్సిడీలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: