స్నేహలత రెడ్డి.. ఈమె గురించి అందరికి తెలిసే ఉంటుంది.. తెలియని వారు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు ఇవి. 1925లో ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించిన స్నేహలత రెడ్డి మద్రాసులోని క్వీన్ మేరీ కాలేజీలో చదువుని అభ్యసించారు. ప్రముఖ నర్తకిగా, నటిగా, దర్శకురాలిగా ఎన్నో  ప్రశంసలందుకున్నారు. పౌర హక్కుల ఉద్యమంలో ఒక కార్యకర్తగా భాగమై ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారు.

 

ప్రముఖ కవి పఠాభి రామరెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆమె తన భర్త ఇద్దరు సామాజిక ఉద్యమకారులు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో ఇద్దరు కలిసి కృషి చేసేవారు. ఆ సమయంలోనే దేశంలో రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఇందిరాగాంధీని గద్దె దించే నినాదంతో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఆ ఉద్యమంలో స్నేహలత కూడా పాలుపంచుకున్నారు.

 

1975 జూన్ 25వ తేదీన అర్థరాత్రి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దానికి వ్యతిరేకంగా జార్జిఫెర్నాండెజ్‌ తదితరులతో పాటు కలిసి స్నేహలత రెడ్డి సన్నిహితంగా పనిచేశారు. ఈ క్రమంలో 1976 మే 2వ తేదీన స్నేహలతను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న ఆమె భర్తను, పిల్లలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంకా ఆ సమయంలో ఆమెకి ఏం చేయాలో తెలియక.. తన పిల్లలను, భర్తను విడుదల చేస్తే విచారణకు సహకరిస్తా అని ఆమె ప్రాధేయపడ్డారు. దీంతో పిల్లలను, భర్తను పోలీసులు విడుదల చేశారు. 

 

బరోడా డైనమైట్ కేసులో జార్జి ఫెర్నాండెజ్‌తో పాటు స్నేహలతను కూడా నిందితురాలిగా చెప్తూ అరెస్ట్ చేశారు. కానీ చార్జిషీట్‌లో ఆమె పేరు లేదు. ఏ ఆధారాలూ లేవు. అయినా జైలు నిర్బంధంలోనే ఆమెని కొనసాగించారు. హింసకు, వేధింపులకు గురయ్యారు. ఈ ఎమర్జెన్సీకి ఎంతో మంది మగ రాజకీయ నాయకులు వ్యతిరేకించినప్పటికీ స్త్రీలలో ఈమె ఒకటే అయ్యారు. 

 

దీంతో ఆమెని పూర్తిగా నిర్బంధించారు. ఆమెని ఒక్కటే సపరేట్ గా నిర్బంధించారు. ఆమెని జైలులో పెట్టిన హింసించిన, వేధింపులకు గురి చేసిన ఆమె తోటి ఖైదీల కోసం జైలులో కూడా నిరాహార దీక్ష చేశారు. తోటి ఖైదీలను అనవసరంగా హింసించడం తగ్గించేలా చేశారు. ఆ స్త్రీ ఖైదీలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఈ విషయాలు అన్ని ఆమె జైలులో ఉన్న సమయంలో డైరీలో రాసుకున్న విషయాలు. 

 

కాగా ఆమె అప్పటికే ఆస్తమా పేషెంట్. దీనికి తోడు ఆమె జైలులో ఉన్నారు. హింసకు, వేధింపులకు గురయ్యారు. అక్కడి ఆహారం కూడా శరీరానికి పట్టలేదు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షిణించింది. ఆసుపత్రికి తీసుకెళ్తే వెంటనే జాయిన్ చెయ్యమన్నారు. కానీ దానికి పోలీసులు సహకరించలేదు. దీంతో జైలులోనే ఎన్నో రాత్రులు ఆమె అనారోగ్యంతో బాధ పడేవారు. 

 

అయితే స్నేహలత ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమించటంతో 1976 డిసెంబర్ 13వ తేదీన ఆమెను పెరోల్ మీద విడుదల చేశారు. కానీ కొద్ది రోజులకే అంటే 1977 జనవరి 20వ తేదీన ఆమె చనిపోయారు. జైలుకు వెళ్లిన సమయంలో ఎంత యవ్వనంగా ఉన్న జైలు నుంచి విడుదల అయినా సమయంలో వృద్ధిరాలుగా, అనారోగ్యంతో వచ్చారు. 

 

అయితే ఎంతోమంది స్త్రీలకు ధైర్యాన్ని నింపిన ఆమె.. ఎమర్జెన్సీ సమయంలో స్త్రీ అయి ఉండి ఆమె పోరాటం అనేది చరిత్రలో నిలిచిపోయింది. ఆమె జీవిత అక్రమ నిర్బంధానాలతో అర్దాంతరంగా అన్యాయంగా ముగిసింది. స్నేహలత జైలులో ఉన్న సమయంలో రాసిన డైరీని, ఆమె జైలు జీవితాన్ని అనంతర కాలంలో 'ఎ ప్రిజన్ డైరీ' స్నేహలత రెడ్డి అనే పేరుతో ప్రచురించారు. వీలయితే ఆ పుస్తకాన్ని ఒకసారి చదవండి.. ఆమె రాసిన సంఘటనలు అన్ని కంటికి కట్టినట్టు ఆమె రాతలో కనిపిస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: