దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ఘాటుకు ప్రభుత్వాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. గతంలో ఇదే ఉల్లిఘాటు దెబ్బకు కేంద్రంలో జనతా ప్రభుత్వమే దిగిపోయింది. అలాంటి ఉల్లిపాయల ఘాటను రాష్ట్రంలో జనాలకు తగలకుండా జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారు. కిలో ఉల్లిపాయల ధర రైతు బజార్లలో కేవలం 25 రూపాయలు మాత్రమే.

 

బహిరంగ మార్కెట్లో ఇదే ఉల్లి ధర సుమారు 100 రూపాయలకు దగ్గరలో ఉంది. బహిరంగ మార్కెట్లో అంత ధరున్న ఉల్లి  రైతు బజార్లలో మాత్రం ఎందుకంత తక్కువే దొరుకుతోంది ? ఎందుకంటే సకాలంలో జగన్ తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్లే అని చెప్పాలి. సగటున రోజుకు రాష్ట్రంలో 100 టన్నుల ఉల్లిపాయల అవసరం ఉందని ఓ అంచనా. ఎందుకంటే ఉల్లిపాయ లేని వంటకమే లేదు కాబట్టి.

 

ఈ విషయం తెలుసు కాబట్టే రోజుకు 150 మెట్రిక్  టన్నుల ఉల్లిపాయలను సేకరించి మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుబజార్లకు ప్రతిరోజు తరలిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో నాణ్యమైన  ఉల్లిపాయలు  కిలోకు రూ. 75 ఉంది. అయితే టోకున ప్రభుత్వం కొంటోంది కాబట్టి బేరసారాల తర్వాత కిలో సుమారు 53 రూపాయలకే దొరుకుతోంది. రవాణా ఖర్చులు, గిడ్డంగుల్లో నిల్వ ఖర్చులు లెక్కేసుకుంటే కిలో ఉల్లిని 72 రూపాయలకు అమ్మాలి.

 

అయితే అంత ధరపెట్టి జనాలు కొనలేరు కాబట్టి ప్రతి కిలో మీద సుమారు 45 రూపాయలను ప్రభుత్వం సబ్సిడిగా ఇచ్చి రైతు బజార్లకు సరఫరా చేస్తోంది. ప్రభుత్వం సబ్సిడి ఇస్తున్న కారణంగానే కిలో ఉల్లి జనాలకు 25 రూపాయలకే దొరుకుతోంది. సరే అందరికీ అవసరమే కాబట్టి మనిషికి కేవలం ఒక్క కిలో ఉల్లిని మాత్రమే అందిస్తోంది.  

 

బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గేంత వరకూ ఇదే విధంగా అమ్మాలని అధికారులను ఆదేశించారు. ధరల స్ధిరీకరణ నిధి నుండి సబ్సిడి మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని జగన్ స్పష్టం చేశారు. ధరలను పెంచేందుకు అక్రమంగ ఎవరైనా ఉల్లిపాయలను నిల్వ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకనే జగన్ దెబ్బకు వ్యాపారులు కూడా ఉల్లిపాయలను మార్కెట్లకు తరలించేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: