రాజకీయాల్లో శత్రువులు ఉంటారా. అంటే ప్రజాస్వామ్యంలో మాత్రం ప్రత్యర్ధులే ఉంటారు అంటారు. కానీ జగన్ విషయంలో మాత్రం ప్రత్యర్ధులు లేరు అందరూ శత్రువులే అయిపోయారు. ప్రత్యర్ధి అయితే గేమ్  స్పిరిట్ చూపిస్తాడు. ఓడినా గెలిచినా ఒకేలా తీసుకుని పోరాడుతూంటాడు. కానీ శత్రువు ప్రత్యర్ధిని శాశ్వతంగా ఎలిమినేట్ చేయాలనుకుంటారు. ఇపుడు ఏపీలో జరుగుతున్నది ఇదే.

 

ఏపీ రాజకీయాల్లో జగన్ కి శత్రువులు ఎక్కువ. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే జగన్ తాను స్వయంగా ఒప్పుకోవడమే అసలైన చిత్రం. ఇంతకు ముందు ఆయన ఒంగోలు మీటింగులో మాట్లాడుతూ తనకు శత్రువులు ఎక్కువ అన్నారు. ఇపుడు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి శత్రువులు అంతా ఒక్కటి అయ్యారని వాపోయారు. నిజమే. జగన్ ఎపుడైతే రాజకీయ ప్రవేశం చేశారో నాటి నుంచి ఒంటరిగానే పోరాడుతున్నారు.

 

జగన్ సిధ్ధాంతాలతో విభేదిస్తే అది వేరు. కానీ ఆయనతో రాజకీయ యుధ్ధమే చేయాలనుకోవడమే ఇబ్బందిగా మారుతోంది. ఏపీలో 2014 నాటి పొత్తులు మళ్ళీ పొడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. నాడు చంద్రబాబు, పవన్, బీజేపీ జత కట్టాయి. ఇపుడు కూడా ఆ మూడు పార్టీలు ఒకే గొంతుతో జగన్ మీద విరుచుకుపడుతున్నాయి. జగన్ మీద మతం కార్డుని ప్రయోగిస్తున్నాయి.

 

ఈ రోజు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు టీడీపీ మాజీ నేత. బీజేపీ కొత్త పూజారి సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. ఏపీలో మత రాజకీయాలు పీక్స్ చేరుకున్నాయని కూడా ఆయన ఆరోపించారు. దీంతో బీజేపీ, జగన్ కి గొడవలు పెట్టాలని బాహాటంగానే టీడీపీ తన మాజీ దోస్త్ ద్వారా యత్నిస్తోందని   అర్ధమైపోతోంది. 

 

మరో వైపు చూసుకుంటే ఏపీలో బలమైన పార్టీగా ఉన్నా కూడా జగన్ తన మీద వ్యక్తిగా విమర్శలు చేస్తున్న వారికి గట్టిగా జవాబు చెప్పలేకపోతున్నారని అంటున్నారు. ఆయన మంత్రులు, నాయకులు కూడా మౌనముద్రలో ఉండడంతో ప్రతిపక్షాలు చెప్పినవే జనంలోకి పోతున్నాయి. దాంతో జగన్ మళ్ళీ ఒంటరిగానే అయిపోయారు. ఆయనకు పార్టీ, ప్రభుత్వ సహకారం అంతగా లేకపోవడం దారుణమే. దీని మీద పత్యర్ధులు ఆడుతున్న మైండ్ గేమ్ ని జగన్ ఒక్కడే తిప్పికొట్టడం అంటే కష్టసాధ్యమైన విషయమే. చూడాలి మరి ఎలా ఎదుర్కొంటారో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: