ఆంధ్రాలో  అవినీతి రహిత పారదర్శక విధానాలకు పెద్దపీట వేస్తున్న  వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి  నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, అవినీతి నిర్మూలన దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. ప్రభుత్వంలోని కీలక విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించడానికి అధ్యయనం, తీసుకోవాల్సిన సిఫార్సులపై సూచనల కోసం దేశంలోనే ప్రముఖ మేనేజ్‌ మెంట్‌ సంస్థ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అహ్మదాబాద్‌ (ఐఐఎం–ఎ)తో అవగాహన ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. 

 

వచ్చే ఫిబ్రవరి మూడోవారం నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంస్థ తన నివేదికను ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రజావిధానాల బృందం (పబ్లిక్‌ సిస్టమ్స్‌ గ్రూపు) ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణస్వామి, రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ చీఫ్‌ విశ్వజిత్‌ సంతకాలు కూడా చేయడం జరిగింది. 

 

ఇక ఒప్పందం ప్రకారం నిర్మూలనకు ప్రయత్నాలు ఇవే..

1. మండల రెవిన్యూ కార్యాలయాలు, మండల అభివృద్ధి కార్యాలయాలు, పట్టణ, మున్సిపాల్టీ ప్లానింగ్‌ డిపార్మెంట్లు, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ ప్రభుత్వ శాఖలను అహ్మదాబాద్‌ ఐఐఎం సమగ్ర అధ్యయనం చేయడం జరిగింది. 


2. అవినీతికి ఆస్కారమిస్తున్న అంశాలను అధ్యయనం చేయడంతోపాటు, అవినీతిని నిర్మూలించడానికి చర్యలను తెసుకోవాలని నిర్ణయం. 


3. సంబంధిత ప్రభుత్వ శాఖల్లో నిర్మాణాత్మక మార్పులను సూచించడమే కాకుండా, అవినీతి నిర్మూలనకు వ్యూహాలను ప్రభుత్వానికి నివేదిస్తుంది. 


4. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను మొదటి నుంచి అవినీతికి దూరంగా నిర్వహించేందుకు సూచనలు చేస్తుంది. 


5. నిర్దేశించిన ప్రభుత్వ శాఖల ఉద్దేశాలు, విధానాలను అమలు చేస్తున్న తీరు, విభాగాల పాత్ర, పరిపాలనా పరమైన పదవులు, వనరులు, ఆదాయాలపై క్షుణ్నంగా అధ్యయనం చేస్తుంది. 


6. పరిపాలనలో ఇప్పుడున్న  లోపాలను గుర్తిస్తుంది. బలమైన పరిపాలనను అందించడంపై సూచనలు చేస్తుంది.  


7. ఉన్న  వనరులను సమర్థవంతంగా వాడుకోవడం, సామర్థ్యాన్ని పెంచడం, మెరుగైన ఫలితాలను రాబట్టడం ఎలా అన్న అంశాలను నివేదికలో పొందు పరుస్తుంది.


8. అవినీతిని నిర్మూలించడానికి విభాగాల పరిపాలనలో మార్పులను సూచిస్తుంది.


రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం తమ సంస్థకు లభిస్తున్న గౌరవంగా భావిస్తున్నామని ప్రొఫెసర్‌ సుందరవల్లి సుబ్రహ్మణ్యం తెలిపారు. అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో తమ పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉందని ఆమె తెలియచేయడం జరిగింది 

 

మరింత సమాచారం తెలుసుకోండి: