ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా  26 డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు అందరూ సమ్మె సైరన్ మోగించిన విషయం తెలిసిందే. 40 రోజుల పాటు సమ్మె కొనసాగించిన  ఆర్టీసీ కార్మికులు ఎన్నో పరిణామాల తర్వాత ఆర్టీసీ సమ్మెను  విరమిస్తానని ప్రకటించారు. హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై తుది విచారణ అనంతరం  ఆర్టీసీ కార్మికులు అందరూ విధుల్లో చేరితే వారికీ  ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన  విషయం తెలిసిందే. అయితే హైకోర్టు సూచించిన మేరకే ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతామని వారికి ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని అలా అయితే సమ్మె విరమిస్తాం అంటూ ఆర్టీసీ జేఏసీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే అయితే 47 రోజుల  పాటు కొనసాగి ఆ తర్వాత సమ్మె విరమణ  ప్రకటన చేయడంతో తెలంగాణలో జేఏసీ  ప్రకటించి సంచలనం రేపింది. 

 

 

 

 ఇదిలా ఉండగా అటు ఆర్టీసీ జేఏసీ సమ్మే విరమిస్తున్నామని  కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న అనేదానిపై ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.కానీ  ఇప్పడి వరకు ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని మాత్రం ప్రకటించలేదు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న సమయంలో ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీలోని 5100 రూట్లను  ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అటు ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు డిపోల వద్దకు వెళ్లినప్పటికీ  కూడా డిపో మేనేజర్స్  ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత విధుల్లో  చేర్చుకుంటామని అంటూ  ఆర్టీసీ కార్మికులను  వెనక్కి పంపించారు. 

 

 

 

 అయితే సమ్మె విరమించినప్పటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం స్పందించకపోతే సేవ్ ఆర్టీసీ  పేరుతో మరో ఉద్యమాన్ని లేవనెత్తుతామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. రేపటి నుంచి అన్ని డిపోల వద్ద సేవ్  పేరుతో భారీ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ స్పందించకుంటే  భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి సమ్మెను ఉధృతం చేస్తామంటూ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణ లో సమ్మె సైరన్ మోగెటట్లు తెలుస్తోంది. ఆర్టిసి నిర్ణయంతో ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునుందా  లేకపోతే ఆర్టిసి జేఏసి చెప్పినట్టుగానే సమ్మె కొనసాగుతుందా  అన్నది ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: