ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ దేవున్ని, మతాలను రాజకీయాల్లోకి లాగొద్దని అన్నారు. దేవుళ్లను, మతాలను రాజకీయాల్లోకి లాగటం ఎవరికీ మంచిది కాదని అవంతి శ్రీనివాస్ అన్నారు. ఇసుక, ఇంగ్లీష్ ఇప్పుడు కొత్తగా జెరూసలేం యాత్రను విపక్షాలు రాజకీయం చేయటం మానాలని అన్నారు. అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం అని అవంతి శ్రీనివాస్ అన్నారు. 
 
విశాఖ ఆర్టీసీ కాంపెక్స్ జంక్షన్ లో దివంగత నేత, మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు వర్ధంతిలో పాల్గొన్న అవంతి శ్రీనివాస్ ఘాటుగా విపక్షాల వ్యాఖ్యల గురించి స్పందించారు. ఒక రకమైన దుష్ప్రచారం కక్ష గట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే ప్రజల్లో పలుచన చేయాలని విపక్షాలు చేస్తున్నాయని 
అవంతి శ్రీనివాస్ అన్నారు. 
 
సీఎం జగన్ ను ప్రజల్లో పలుచన చేయటానికి విపక్షాలకు ఎక్కడా కూడా అవకాశం దొరకటం లేదని అవంతి శ్రీనివాస్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీడీపీ హయాంలో టికెట్లను ముద్రించారని మేమేదో చేశామని అన్నారని అవంతి శ్రీనివాస్ చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిందెవరని రాజశేఖర్ రెడ్డి కూల్చాడా...? చంద్రబాబు నాయుడు కూల్చాడా..? అని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు, 
 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మతం అనేదాన్ని రాజకీయాల్లోకి తీసుకొనిరావొద్దని అన్నారు. అన్య మతస్థుల్లో మంచివాళ్లు ఉన్నారని అన్య మతస్థుల్లో పేదవారు ఉన్నారని అవంతి శ్రీనివాస్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత బురద జల్లితే మీరే అంత నష్టపోతారని టీడీపీని ఉద్దేశించి అవంతి అన్నారు. సీఎం జగన్ అందరికీ మంచి చేయాలని ఆలోచన చేసే వ్యక్తి అని అవంతి శ్రీనివాస్ అన్నారు. ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు విపక్షాలు చేసినా అవి దేవుడి ముందు, ప్రజల ముందు సాగవని అవంతి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని సమానంగా ఆదరిస్తుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: