రెండు అక్షరాల ప్రేమా.. రెండు క్షణాల ప్రేమ.. జీవితాన్ని మార్చేసే ప్రేమ.. రంగుల వలయంలో ముంచేసే ప్రేమ.. కడలి బంధంలో బంధించే ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చు. ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో అంత విషాదంగా కూడా ఉంటుంది.  ఒక వ్యక్తిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.  అదే సమయంలో అత్యంత అఘాతంలో కూలదోస్తుంది ప్రేమ.  కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టుగా ప్రేమకు అన్ని వైపులా పదును ఉంటుంది.  


ప్రేమ వలన వ్యక్తులు ఒక్కోసారి ఉన్నత స్థానానికి ఎదుగుతారు.  అదే సమయంలో అత్యంత పాతాళానికి దిగిపోతారు.  పాతాళానికి దిగిపోయినా.. ఉన్నత స్థానానికి ఎదిగినా అన్ని ప్రేమ వలనే అంతా ప్రేమ వలనే.   ప్రేమను ప్రేమగా చూసినపుడు ప్రేమ గొప్పగా ఉంటుంది. కొన్ని సార్లు ఈ ప్రేమ.. ప్రేమిస్తే సినిమాలో భరత్ కు పట్టిన గతిని పట్టిస్తుంది.  అవును ఇది నిజం.  మనిషిని పిచ్చివాడిని చేస్తుంది.  


పిచ్చివాడిలా రోడ్డుపట్టుకు తిరిగేలా చేస్తుంది.  ఇందుకు ఓ ఉదాహరణ ప్రశాంత్ కథ.  ప్రశాంత్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.  బెంగళూరు నుంచితానూ ప్రేమించిన అమ్మాయిని వెతుక్కుంటూ పాకిస్తాన్ బోర్డర్ చేరుకున్నాడు.  అక్కడ పాక్ సైనికులకు చిక్కాడు.  ప్రస్తుతం పాక్ లో బందీగా ఉన్నాడు.  ప్రేమించిన అమ్మాయి కోసమే ఇంట్లో వాళ్లతో విభేదించి బయటకు వచ్చేసి ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు.  


ఇప్పుడు ఇలాంటి సంఘటనలే ఒకటి హైదరాబాద్ లో జరిగింది.  హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే రక్షక్ రాజ్ ప్రేమించిన అమ్మాయి కాదనడంతో పిచ్చివాడిగా మారిపోయాడు.  దొకిరింది తింటూ రోడ్డుపక్కన పడుకుంటున్నాడు.  ఐదు అంకెల జీతం.. మంచి జీవితం... రెండు అక్షరాలా మాట కోసం నాశనం చేసుకున్నాడు.  జీవితాన్ని వృధా చేసుకొని పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: