జగన్ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో విద్య అభివృద్ధికి  వేగంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. రాహ్ట్రంలోని పేద విద్యార్థులందరికీ  మెరుగైన విద్యను అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ క్రమంలోనే అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలోని పేద పిల్లలందరూ బడికి పోయే లా చేయూతనిచ్చేందుకు  సరికొత్త నిర్ణయం తీసుకున్నారు  జగన్ మోహన్ రెడ్డి. ఇక పాఠశాలకు వెళ్లిన పేద  విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించేందుకు నాడు నేడు  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాడు నేడు లో భాగంగా ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. పదవ తరగతి వరకు ఇంగ్లీష్ బోధన అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కాలంలో ఇంగ్లీష్ విద్య రాక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సరైన ఉద్యోగం కూడా చేయలేకపోతున్నారనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి మెరుగైన విద్యను పేద విద్యార్థులకు అందించేందుకు జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. 

 

 

 

 అయితే దీనిపై చంద్రబాబు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.  తెలుగు భాషను నిర్వీర్యం చేసేందుకు జగన్ ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టారు అంటూ చంద్రబాబు  విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగు భాషను  మసకబారేలా చేసేందుకే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం  ప్రవేశపెడుతున్నారు అంటూ ఆరోపిస్తున్నారు . అయితే చంద్రబాబు విమర్శలపై  స్పందించిన మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేసారు . చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా యూ టర్న్ లేనంటూ  మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు మనసు  ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉంటుందని పేర్ని నాని అన్నారు. అంతేకాకుండా అవకాశవాద రాజకీయాలు చంద్రబాబుకు ప్రోత్సహిస్తారని అందుకే ఎక్కువగా ఆయనను యూ టర్న్  బాబు అంటుంటారు అని ఎద్దేవా  చేశారు మంత్రి పేర్ని నాని. 

 

 

 

 టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన దగ్గర ఉన్నదాన్ని పుత్తడి  అంటారు... అదే వేరే వాళ్ల దగ్గర ఉంటే దానినే  ఇత్తడి  అంటారు అంటు  మంత్రి పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ  కాలంలో ఇంగ్లీష్ మీడియం లేక ఎంతో మంది  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...అందుకే ఇప్పుడు పేద విద్యార్థులు అలా ఇబ్బంది పడకూడదనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నారని అన్నారు.  చంద్రబాబుకి పేద విద్యార్థులు బాగుపడుతుంటే నచ్చటం లేదు...అందుకే విమర్శలు చేస్తున్నారు అంటూ మంత్రి పేర్ని నానీ అన్నారు . రాష్ట్రంలో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడితే ఎందుకు విమర్శలు చేస్తున్నారో  అర్థం కావడం లేదు అంటూ పేర్ని నానీ అన్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మీకు కనిపించడం లేదా చంద్రబాబు గారు అంటూ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్  వినూత్న పథకాలతో  ముందుకు సాగుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం అనవసర రాద్ధాంతం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు అంటూ మంత్రి పేర్ని నాని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: