గత కొన్ని రోజులుగా అయోమయంలో ఉన్న మహారాష్ట్ర హడావుడి ఓ కొలిక్కి వచ్చిందా.. ముగింపు దశకు చేరుకుందా అంటే అవుననే సమాధానం వస్తున్నది.  అక్టోబర్ 21 వ తేదీన ఎన్నికలు జరిగి అక్టోబర్ 24 న ఎన్నికల రిజల్ట్ వచ్చిన తరువాత నుంచి అసలు రాజకీయం మొదలైంది.  ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ ఇవ్వకపోగా, గతంలో కంటే బీజేపీకి 17 స్థానాలు తగ్గడంతో శివసేన గేమ్ మొదలుపెట్టింది.  ముఖ్యమంత్రి పీఠం పంచుకోవాలని లేదంటే తమ దారి తాము చూసుకుంటామని చెప్పింది.  
బీజేపీ మాత్రం శివసేనతో కలిసి ముఖ్యమంత్రి పీఠం పంచుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో శివసేన బయటకు వచ్చేసింది.  బయటకు వచ్చి కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసేందుకు సిద్ధం కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.  గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో ఈ మూడు పార్టీల మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్సీపీ కూడా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.  
మహాపీఠంపై ఎన్సీపీ కూడా ఆశపడుతున్నట్టు తెలుస్తున్నా.. కాంగ్రెస్ మాత్రం ముఖ్యమంత్రి పీఠం శివసేనకు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టుగా సమాచారం.  కాంగ్రెస్ పార్టీ 12 మంత్రి పదవులు, ఉపముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే అవకాశం ఉన్నది.  ఈరోజు మూడు పార్టీల ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం అయ్యి, సాయంత్రానికి ఒక ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు.  ఈ రోజు సాయంత్రం వరకు దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.  
ఇక ఇదిలా ఉంటె, ఒకవేళ ముఖ్యమంత్రి పీఠం శివసేనకు ఇవ్వాల్సి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది తెలియాల్సి ఉన్నది.  శివసేన చీఫ్ ఉద్దవ్ లేదా ఆదిత్య థాకరేలు ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది.  ఈ ఇద్దరు కాదంటే.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి అరవింద్ సావంత్ పేరు కూడా ముఖ్యమంత్రి పదవికి వినిపిస్తోంది.  ఈరోజు జరిగే కీలక చర్చల తరువాత ఎవరు ఏంటి అనే విషయాలు బయటకు వస్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: