వచ్చే నెల  డిసెంబర్ 9 నుండి ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు   ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాట్ హాట్ గా కొనసాగుతున్న  ఏపీ పాలిటిక్స్ ఈ సమావేశాల సమయంలోఅసెంబ్లీ లో  మరింత ఉద్రిక్తతను  కలిగించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను ప్రతిపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయి.

 

వీటన్నింటి పైనా ప్రభుత్వం సభా వేదికగానే సమాధానం ఇవ్వాలని నిర్ణయిచుకున్నట్లు ఉంది . ఇదే సమయంలో స్పీకర్ పైన అనుచితంగా వ్యవహరించారనే అభియోగంతో టీడీపీ నేతల పైన ఇప్పటికే వైసీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. దీని పైన వచ్చే  సమావేశాల్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది . ఇక టీడీపీ నుండి ఎమ్మెల్యేలు బయటకు వస్తారనే ప్రచారం నడుమ ఈ సమావేశాల్లో టీడీపీ రెబల్స్ ఎవరనేది బయటపడుతుందని   అంచనా వేస్తున్నారు.

 

వంశీ ఎపిసోడ్ పైన ఆసక్తి నెలకొంది.ఈ సమావేశాల్లో ప్రస్తుతం అధికార...విపక్షాల మధ్య అనేక కీలక అంశాల మీద చర్చ సాగనుంది. ఇంగ్లీషు మీడియం పాఠశాలలు..ఇసుక సమస్య.. రాజధాని, పోలవరం, మద్యపాన నిషేధం వంటి అంశాల పైన చర్చకు సిద్దమని ప్రభుత్వం చెబుతోంది. ఇవే అంశాల పైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం సైతం సన్నాహాలు చేసుకొంటుంది.  టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు.. కూన రవికుమార్ పైన చర్యలకు వైసీపీ డిమాండ్ చేస్తంది. దీని పైన స్పీకర్ తీసుకొనే నిర్ణయం ఆసక్తి కరంగా మారనుంది.

 

ఇప్పటికే టీడీపీ నుండి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి దూరమయ్యారు. అదే సమయంలో వైసీపీలో సైతం చేరలేదు. ఆయన పైన టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు ఆయన సభలో స్వతంత్ర అభ్యర్దిగా వ్యవహరిచాల్సి ఉంటుంది. అయితే, అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం టీడీపీ సభ్యుడిగానే ఉంటారు. ఇక, ఇదే సమయంలో మాజీ మంత్రి గంటా తో సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం పార్టీ వీడుతారని ఊహ ఘనాలు వెలువడుతున్నాయి  అసెంబ్లీ సమావేశాల్లోగానే ఈ అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీడీపీ సైతం పార్టీని వీడి వైసీపీతో కలిసే వారి విషయంలో రివర్స్ ప్లాన్ తో సిద్దమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: