నాడు వైఎస్సార్ రచ్చబండ పేరిట ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకున్నారు. దాని కోసం 2009 సెప్టెంబర్ 2న ముహూర్తంగా కూడా పెట్టుకున్నారు. అయిత ఆయన దుర్మరణం పాలు కావడంతో రచ్చబండను శ్రీకారం చుట్టకుండానే మూలన‌పండింది. ఇపుడు జగన్ సీఎంగా ఉన్నారు. జగన్ సైతం జనాల్లో తిరగాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన రచ్చబండతో మళ్ళీ పెను సంచలనం స్రుష్టించాలనుకుంటున్నారు.

 

జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తారని అంటున్నారు. ప్రజల వద్దకు ముఖ్యమంత్రిగా నేరుగా  వెళ్ళి వారికి అందుతున్న  కార్యక్రమాల గురించి  జగన్ స్వయంగా తెలుసుకుంటారంట. ఆ తరువాత వారి సమస్యలు ఇబ్బందులు కూడా గుర్తించి అక్కడికక్కడ హామీలు ఇవ్వడం, వాటిని సాధ్యమైనంత  తొందరలోనే పరిష్కరినడం తన విధానంగా జగన్ పెట్టుకున్నారు.

 

ఈ రోజు అమరావతిలో జరిగిన అధికారుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా చెప్పారు. తాను రచ్చబండకు వెళ్తే కచ్చితంగా హామీలు ఇస్తానని, వాటిని ఎప్పటికపుడు చూసుకుని పరిష్కారం అయ్యేలా చేయాల్సింది అధికారులేనని జగన్ క్లారిటీగా చెప్పేశారు. రచ్చబండ ద్వారా జనంతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుందని జగన్ భావిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా ఏపీలో రచ్చబండ కార్యక్రమం వైఎస్సార్ కి అచ్చిరాలేదన్నది వైసీపీలో ఉంది. దాని కోసమే ఛిత్తూరు జిల్లా  వెళ్తూ ఆయన దుర్మరణం పాలు అయ్యారని అంటున్నారు. జగన్ సైతం రచ్చబండ కాకుండా వేరే పేరు మార్చినా ఫరవాలేదని కూడా చెబుతున్నారు. మరో వైపు జగన్ మాత్రం తన తండ్రి ప్రకటించిన రచ్చబండ పేరు తోనే జనంలోకి వెళ్ళాలని అనుకుంటున్నారు.

 

రచ్చబండ పేరుతో  జనంలోకి చొచ్చుకుపోవడం ద్వారా ప్రతిపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. స్థానికి సంస్థల ఎన్నికలు మార్చిలో రాబోతున్నాయి. అందువల్ల జనంలో ఉండడం ద్వారా మరో మారు బంపర్ విక్టరీని సాధించాలని జగన్ అనుకుంటున్నారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: