మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..జనసేన అధినేత పవన్ పైన రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. వారిద్దరూ ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు తిప్పి కొట్టారు. వైసీపీ నుండి ఎంపీలు..ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యల మీద మండిపడ్డారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన సుజనా చెప్పే మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. అదే సమయంలో వైసీపీ నుండి ఎవరూ వేరే పార్టీల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. ఇంగ్లీషు మీడియం మీద అర్దం లేని వాదన చేస్తూ.. ప్రజల వ్యతిరేకత గుర్తించి యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేసారు.

 

 

   వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబు..పవన్ కళ్యాణ్ మీద మండి పడ్డారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాలతో తమకు భవిష్యత్ లేదనే భయంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు చిన్న మెదడు చితికిందని వ్యాఖ్యానించారు. జగన్ చేసే మంచి పనులను విమర్శించటమే కానీ..అభినందించటం వారికి తెలియదన్నారు. ముఖ్యమంత్రి ఆరు నెలల సమయం లో తీసుకున్న నిర్ణయాలను ప్రజలు మెచ్చుకుంటున్నారని వివరించారు. కేంద్ర మాజీ మంత్రి చెబుతున్నట్లుగా వైసీపీ నుండి ఎవరూ పార్టీ వీడటం లేదని..ఆ అవసరం లేదన్నారు. ముందు సుజనా చౌదరి తాను బ్యాంకులకు ఎగ్గొట్టిన రుణాల పైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి జగన్ పేదల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతుంటే రాద్దాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంగ్లీషు మీడియం పెడితే మతమార్పిడిలు జరుగుతా యంటూ చేస్తున్న విమర్శలను తప్పు బట్టారు. వాటిని సిగ్గులేని వారు చేసే వ్యాఖ్యలుగా ఖండించారు. 

 

 

   ఎన్టీఆర్ ట్రస్టు, వెంకయ్య నాయుడు కుమార్తె నిర్వహిస్తున్న స్వర్ణ భారతి ట్రస్టు, రామోజీరావు నిర్వహిస్తున్న పాఠశాలలు ఇంగ్లీషు మీడియం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీ నారాయణ కు చెందిన విద్యా సంస్థలు ఇంగ్లీషు మీడియాలేనని, అక్కడ కూడా మత మార్పిడి జరుగుతుందా అని ప్రశ్నించారు. జగన్ తీసుకున్న నిర్ణయం తో వారి స్కూళ్లు మూతబడతాయనే భయంతో ఉన్నారని వివరించారు. చంద్రబాబు ఇప్పటికీ యూ టర్న్ బాబుగానే ఇసుక..ఇంగ్లీషు మీడియం విషయంలో చంద్రబాబు రాద్దాంతం చేసి ప్రజల వ్యతిరేకత కారణంగా యూ టర్న్ తీసుకున్నారని..ఇప్పటికీ ఆయన యూ టర్నర్ బాబుగానే ఉన్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు నమ్మరనే విషయం వారికి అర్దం కావటం లేదన్నారు. వైసీపీ నేతలు పార్టీ మారుతారనే ప్రచారాన్ని రోజా తిప్పి కొట్టారు. సంక్షేమ పధకాల అమల్లో దేశంలోనే ఏపీ తొలి స్థానం లో నిలుస్తుందని రోజా చెప్పుకొచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా..జగన్ ప్రజా బలం ముందు నిలబడలేరని రోజా వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: