ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌బోడుతున్న ఆంగ్ల మాధ్య‌మం కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. నిరక్షరాస్యతను రూపుమాపడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కంకణం కట్టుకున్నారని ఆమె తెలిపారు. పాదయాత్ర సందర్భంగా పేదలు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని కోరారని..ముఖ్య‌మంత్రి అయిన అనంత‌రం బడుగు బలహీన వర్గాలు కోసం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టారని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం వలన తెలుగు భాష నష్టపోదని ఆమె స్ప‌ష్టం చేశారు.  పిల్లల భవిష్యత్ గురించే ఇంగ్లీషు మీడియంను ముఖ్యమంత్రి  వైయస్ జగన్ ప్రవేశపెట్టారని ఆమె పేర్కొన్నారు. అమ్మ లాంటి  తెలుగు భాషకు త‌మ ప్రభుత్వం అన్యాయం చేయదని ఆమె స్ప‌ష్టం చేశారు.

 

తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ల‌క్ష్మీపార్వ‌తి ప్రైవేట్ స్కూల్ల‌లో అంతా ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నారని తెలిపారు. ``నారాయణ, శ్రీ చైతన్య స్కూల్స్ కోసం 6 వేల ప్రభుత్వ పాఠశాలల‌ను గతంలో చంద్రబాబు మూయించారు.  ప్రైవేట్ స్కూల్స్ పేదల నుంచి లక్షల రూపాయల దోచే దోపిడీ నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కాపాడుతున్నారు. తెలుగు గురించి మాట్లాడే వాళ్ళు ఎందుకు వాళ్ళ పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూల్స్ చదివిస్తున్నారు? నాకు, వెంకయ్య నాయుడుకు అవకాశము ఉంటే వచ్చే జన్మలో అమెరికాలో పుడతామని గతంలో చంద్రబాబు చెప్పారు. దీన్ని బట్టే తెలుగు రాష్ట్రం అంటే చంద్రబాబుకు ఎంత ఇష్టం ఉందో తెలుస్తోంది.`` అని ఎద్దేవా చేశారు. తెలుగు భాషాకు ప్రాచీన హోదా కోసం ఎందుకు చంద్రబాబు కృషి చేయలేదు అని లక్ష్మీపార్వ‌తి నిల‌దీశారు. ``భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టింది చంద్రబాబు నాయుడు. పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేసి రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వాని చంద్రబాబు లేఖ ఇచ్చారు. తెలుగు జాతి గౌరవాన్ని కాపాదిండి ఎన్టీఆర్.. అటువంటి ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం ఎందుకు కృషి చేయలేదు?`` అని ప్ర‌శ్నించారు.

 

ఇంగ్లీష్ మీడియంలో పట్టు లేక అనేకమంది ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ల‌క్ష్మీపార్వ‌తి తెలిపారు. ``ఎన్టీఆర్ మనసపుత్రిక తెలుగు విశ్వవిద్యాలయంను ఎందుకు రాష్ట్రానికి చంద్రబాబు తేలేకపోయారు? తెలుగు అభివృద్ధి కోసం చంద్రబాబు చేసింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరపలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు కూడా అర్పించలేని పరిస్థితి లో  చంద్రబాబు ఉన్నారు. తెలుగు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదు. లోకేష్ తెలుగే కాదు ఇంగ్లీష్ కూడా సరిగా రాదు` అని ఎద్దేవా చేశారు.ఏబీఎన్ రాధాకృష్ణ తన కుమారుడుని తెలుగు మీడియంలో చదివించారా? ఈనాడు రామోజీరావు తన జర్నలిజం కాలేజీని తెలుగులో పెట్టారా?చంద్రబాబు తన కుమారుడిని మనవడని ఇంగ్లీష్ మీడియంలో చదివించలేదా` అని నిల‌దీశారు. వెంకయ్యనాయుడు ఇంగ్లీష్, హిందీ నేర్చుకోవడం వలనే ఉన్నత పదవులు సాధించారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: