సెలవులు.. ఎవరు కోరుకోరండి.. పిండి బడికి వెళ్లే పాప నుండి రేపో మాపో రిటైర్ అయ్యే ఉద్యోగి వరుకు ప్రతి ఒక్కరు సెలవు కావాలనుకుంటారు. పిల్లలైతే బడి ఉండదు అని.. పెద్దలు అయితే కొంత సేద తీర్చుకోవచ్చని కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే 2020కి సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.     

 

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి గురువారం (నిన్న) ఉత్తర్వులు జారీ చేశారు. 28 సాధారణ సెలవుల్లో 5 సెలవులు ఆదివారం/రెండో శనివారం వస్తున్నాయి. ప్రధాన పండుగలైన దసరా, మొహర్రం, గణతంత్ర దినోత్సవం, బాబూ జగ్జీవన్‌రాం జయంతి ఆదివారం వచ్చాయి. అలాగే దీపావళి రెండో శనివారం రానుంది. మిగిలిన 23 సాధారణ సెలవుల్లో 6 సెలవులు శనివారాల్లో వస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు మరుసటిరోజు ఆదివారం సెలవు రోజు కలసి రానుంది.

 

అదే విధంగా మరో 5 సాధారణ సెలవులు శుక్రవారం వస్తున్నాయి. మరో 4 సాధారణ సెలవులు సోమవారం వస్తుండటంతో అంతకుముందు రోజు ఆదివారం సెలవు కలసి రానుంది. జనవరి 1న కొత్త ఏడాది సందర్భంగా సెలవు ప్రకటించినందున ఫిబ్రవరి 8న రెండో శనివారం వర్కింగ్‌ డేగా ప్రభుత్వం వెల్లడించింది. తమ మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ఐచ్ఛిక సెలవుల్లో ఏవైనా 5 సెలవులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోవచ్చని పేర్కొంది.

 

చూశారుగా.. 12 నెలల్లో ఆదివారాలు, రెండో శనివారాలు కాకుండా దాదాపు నెల రోజులు సెలవలు వచ్చాయి. కంటిన్యూగా సెలవలు లేకపోయినా ఏదో ఒకరోజు నెలకు రెండు మూడు రోజులు అయినా సెలవలు వచ్చాయి. ఏదైతేనేం ఉద్యోగులకు, పిల్లలకు రెస్ట్ తీసుకోడానికి ఈసారి సెలవులు బాగానే వచ్చాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: