హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర కలకలం రేగింది. ఎఎస్సై నరసింహ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. నరసింహకు తీవ్ర గాయాలు కావటంతో డీఆర్డీవో అపోలోకు తరలించారు. ఎఎస్సై నరసింహ శరీరానికి 25 శాతం కాలిన గాయాలయ్యాయని సమాచారం. ఒక కేసు విషయంలో తనకు సంబంధం లేకపోయినా ఉన్నతాధికారులు వేధింపులకు పాల్పడటంతో నరసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సమాచారం. 
 
తనపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని మనస్తాపం చెందిన నరసింహ పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ బాటిల్ లోని పెట్రోల్ ను తనపై పోసుకొని నరసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ సిబ్బంది మంటలార్పి నరసింహను రక్షించారు. సిబ్బంది వెంటనే సమీపంలోని డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. డీఆర్డీవో వైద్యులు నరసింహకు ప్రాణాపాయం అయితే లేదని చెబుతున్నారు. 
 
ఏదైనా కేసుకు సంబంధించిన సమస్యలు ఉంటే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలి కానీ తనకు ఏ మాత్రం సంబంధం లేని కేసులో తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో ఎఎస్సై నరసింహ మనస్తాపానికి గురయ్యాడని తెలుస్తోంది. సీఐ సైదులు వేధించినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ ఇప్పటికే మొదలుపెట్టారని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం ఎఎస్సై నరసింహను బాలాపూర్ నుండి మంచాల పీఎస్ కు బదిలీ చేశారు. 
 
ఈ బదిలీకి కూడా సీఐ సైదులు కారణమని నరసింహ ఆరోపణలు చేసినట్లు సమాచారం. కొన్ని ఆరోపణలు వచ్చినందువలనే నరసింహను ఉన్నతాధికారులు బదిలీ చేశారని సమాచారం. ప్రస్తుతం నరసింహకు అత్యవసర వైద్య విభాగంలో చికిత్స అందుతోంది. పోలీసులు ఏఎస్సై కుటుంబసభ్యులకు నరసింహ ఆత్మహత్యాయత్నం గురించి సమాచారం అందించారు. ఏఎస్సై స్థాయి అధికారి ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. సకాలంలో సిబ్బంది ఏఎస్సైని రక్షించడంతో ఏఎస్సై నరసింహ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: