ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ కు అనుకూలంగా తీర్పు రావటంతో కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. 
 
పిటిషనర్ సరైన సాక్ష్యాలు సమర్పించలేకపోవటంతో తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినట్లు సమాచారం. 5,100 రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించిన గైడ్ లైన్స్ ను కోర్టు ప్రస్తావిస్తోంది. ఈరోజు రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్ పై జరిగిన విచారణలో అడ్వకేట్ జనరల్ కేబినేట్ నిర్ణయాలను సవాల్ చేయలేరని వాదించారు. అడ్వకేట్ జనరల్ ఆర్టీసీపై పూర్తి స్థాయి అధికారం ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేశారు. 
 
అడ్వకేట్ జనరల్ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. హైకోర్టు రూట్ల ప్రైవేటీకరణ అమలు బాధ్యత ఎవరికి ఇచ్చారని ప్రశ్నించగా కేబినేట్ తీర్మానంలో రాష్ట్ర రవాణా అథారిటీకి అధికారం ఇస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ తెలిపారు. అథారిటీ ప్రభుత్వం చేయాల్సిన పనిని ఎలా చేస్తుందని ప్రశ్నించగా అడ్వకేట్ జనరల్ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రక్రియను నిర్వహిస్తారని బదులిచ్చారు. 
 
హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టీసీ కార్మికులకు షాక్ అని చెప్పవచ్చు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరటానికి మరిన్ని సమస్యలు ఏర్పడినట్లే అని చెప్పవచ్చు. సమ్మె విరమిస్తామని ప్రకటించినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం చెప్పకపోవటంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరలా మొదలైంది. ఆర్టీసీ కార్మికులు లేబర్ కోర్టు పరిధిలో అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ప్రభుత్వం కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవటం కష్టమే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: