గూగుల్ బహుశా ఈ పేరు వినని వారు,దాని సేవలు పొందని వారు ఉండి ఉండరు. ప్రపంచంలోనే నంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్. దీన్ని తలదన్నే మొగాడు ఇంకా పుట్టలేదు అని భావిస్తుంటుంది. అయితే గూగుల్ ను కూడా షేక్ చేసే హ్యాకర్ల వ్యవహారం అప్పుడప్పడూ బయటపడుతోంది. అయితే ప్రతీసారి అప్ డేట్ అవుతూ హ్యాకర్లకు చిక్కకుండా తన వ్యవస్థను నిర్మించుకుంటోంది గూగుల్.

 

 

   తాజాగా స్మార్ట్ ఫోన్ హ్యాకర్లకు  గూగుల్ సవాల్ విసిరింది. కొత్తగా  గూగుల్ తీసుకొచ్చిన అప్ డేటేడ్ గూగుల్ పిక్సల్ స్మార్ట్ ఫోన్ ను ఎవరైనా హ్యాక్ చేయగలిగితే వారికి గూగుల్ 1.5 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 10 కోట్లకు పైగా బహుమతిని ఇస్తానని ప్రకటించింది.గూగుల్ ను హాక్ చేయడం కష్టమని అంతటి అధునాతన టెక్నాలజీ వాడుతున్నామని,ఎవరైనా హ్యాక్ చేయలేరని ధీమా వ్యక్తం చేసింది.

 

 

   గూగుల్ తన తయారీ పిక్సెల్ ఫోన్ భద్రతను పరీక్షించేందుకు ఈ సవాల్ చేసింది. గూగూల్ పిక్సెల్ ఫోన్ లో టైటాన్ ఎం స్ట్రాంగ్ సెక్యూరిటీ చిప్ ను గూగుల్ అమర్చింది. ఇది ఫోన్ ను హ్యాక్ కాకుండా డేటా చోరీ కాకుండా కాపాడుతుంది. సో ఎంతో పకడ్బందీగా తయారు చేసిన ఈ ఓఎస్ ఫోన్ ను ఎవరూ హ్యాక్ చేయలేరని చెబుతోంది.అయితే గతంలో గూగుల్ తయారు చేసిన ఈ ఆండ్రాయిడ్ ఓఎస్ ను ఇప్పటిదాకా 1800 మంది హ్యాక్ చేసి చూపించారు. వారందరికీ గూగుల్ 4 మిలియన్ డాలర్లను చెల్లించింది. తాజా ఓఎస్ పై సవాల్ చేసింది.. సో ఔత్సాహికులు ఈ గూగుల్ సవాల్ ను స్వీకరించి హ్యాక్ చేయవచ్చు.10 కోట్లను బహుమతిగా గెలుచుకోవచ్చు.

గూగుల్ పిక్సెల్ ఫోన్ ను కనుక ఎవరుహ్యాక్ చేయలేక  పోతే ప్రపంచ రికార్డు కొట్టేసినట్టే, ఒక వేళా ఎవరైనా హ్యాక్ చేస్తే వాళ్ళు కోట్లు కొల్లగొట్టినట్టే. హ్యాకింగ్ కళాకారులారా మీ కళను చూపండి, గూగుల్ ఇచ్చే కోట్లను కోళ్ల గొట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి: