సమాజంలో ఎవరైన తాళికట్టిన భర్తకు ప్రాణ దానం చేయాలనుకొంటారు. కాని ప్రాణాలు తీయాలనుకోరు. అతనికి ఆపద రాకుండా తన తాళి పదికాలాల పాటు తెగకుండా ఉండాలని పూజలూ, నోములు చేస్తారు. కాని ఒక భార్య మాత్రం తన భర్త ప్రాణాలు తీయడానికి పోలీసుల అనుమతినే కోరుతుంది. ఇలా ఎందుకంటే నిత్యం తాగొచ్చి భర్త పెడుతున్న బాధలు భరించలేకపోయిన మహిళ అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది.

 

 

అందుకోసం ఏకంగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లి తన భర్తను చంపేందుకు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. దీంతో కంగుతిన్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఘటన వివరాలు పరిశీలిస్తే జార్ఖండ్‌ రాజధాని రాంచీ ప్రాంతంలో నివసించే జీవన్ దేవి అనే మహిళ రాంచీ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి ఆమె చెప్పిన విషయం విని షాకయ్యారు. అదేమంటే మా ఆయన్ని చంపేయాలనుంది. అందుకోసం అనుమతి ఇవ్వండి’ అని డిప్యూటీ కమిషనర్‌ను కోరింది.

 

 

ఇకపోతే ప్రపంచంలో ఏ మహిళ ఐనా తన భర్త పెట్టే చిత్రహింసల నుంచి కాపాడాలనో, అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి మనసు మార్చాలనో ఫిర్యాదు చేయడం తెలుసు గానీ, భర్తను చంపేందుకు ఓ మహిళ పోలీసుల అనుమతినే కోరడంతో జార్ఖండ్‌లో సంచలనం రేపింది. మహిళ ఫిర్యాదుపై ఏం చేయాలో పాలుపోని పోలీసులు ఆమెకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు.

 

 

ఈ ఘటనపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇకపోతే ఇంతకు ఈమె భర్త ఏం చేసాడంటే మద్యానికి బానిసై రోజూ తాగొచ్చి వేధిస్తున్నాడట. ఒక్కోసారి ఒంటిపై మద్యం మత్తులో దుస్తులు విప్పేస్తున్నాడట.

 

 

ఇతని చర్యలకు వారి ఇద్దరు కూతుళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారని, సంపాదిన ఆదాయం మొత్తం తాగుడుకే ఖర్చు పెట్టేయడమే గాక. ఖర్చుల కోసం డబ్బులు అడిగితే చావబాదుతున్నాడని తెలిపింది.. అందుకే నా భర్త పెట్టే చిత్రహింసలకు విసిగిపోయాను. ఆయన్ని చంపేయాలనుందని కోరుతుందట. ఇలా ఈమె మొదలుపెట్టే ఈ పనిని ఆదర్శంగా తీసుకుని అందరు భార్యలు ఇలానే చేస్తే సమాజంలో మగాడి పరిస్దితి ఏంటి?

మరింత సమాచారం తెలుసుకోండి: