వ్య‌భిచారం రోజుకో కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఒక‌ప్పుడు వ్య‌భిచారం అంతా గుట్టు చ‌ప్పుడు కాకుండా జ‌రిగేది కాని ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది. వ్య‌భిచారం ఇప్పుడు సోష‌ల్ మీడియా విజృంభ‌ణ‌తో వాట్సాప్‌ల‌లోనే న‌డుస్తోంది. వాట్సాప్‌ల‌లో అమ్మాయిల ఫొటోలు షేర్ చేసుకుంటున్నారు.. మ‌నీ అంతా ఆన్‌లైన్ లోనే ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తున్నారు. అమ్మాయి ఎక్క‌డ‌కు రావాలో చెప్పి అక్క‌డే ఎంజాయ్ చేసి పంపించేస్తున్నారు. దీంతో ఎవ్వ‌రికి ఎలాంటి అనుమానాలు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

 

తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. నవీ ముంబయిలోని ఓ హోటల్‌లో రైడ్ చేసి 40 మంది సెక్స్ వర్కర్లకు విముక్తి కల్పించారు. గ‌త కొంత కాలంగా ముంబైలో వ్య‌భిచారం భారీ దందాగా మారింది. న‌వీ ముంబైలోని మాప్కో సెంట‌ర్లో బ్లూస్టార్ హోట‌ల్లో గుట్టు చ‌ప్పుడు కాకుండా ఈ వ్య‌భిచార దందా న‌డుస్తున్న‌ట్టు ముంబై సెంట్రల్ యూనిట్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది.

 

ఈ క్ర‌మంలోనే ఈ గుట్టు ర‌ట్టు చేసేందుకు పోలీసులు ఓ పోలీసును అక్క‌డ‌కు విటుడిగా పంపారు. ఆ వ్య‌క్తి హోట‌ల్లో రూమ్ తీసుకుని త‌న‌కు అమ్మాయి కావాల‌ని ఆర్డ‌ర్ చేశాడు. దీంతో హోట‌ల్ వారు రు.5 వేలు తీసుకుని 17 ఏళ్ల అమ్మాయిని ఆ పోలీసు వ‌ద్ద‌కు పంపారు. అక్క‌డ ఆ పోలీసులు ఆ 17 ఏళ్ల సెక్స్ వ‌ర్క‌ర్‌ను జాగ్ర‌త్త‌గా మాట‌ల ముగ్గులోకి దింపి... ఆమె నుంచి మొత్తం వివ‌రాలు రాబ‌ట్టాడు.. ఇంకేముందు ఆ హోట‌ల్లో ఉన్న అంద‌రి సెక్స్ వ‌ర్క‌ర్ల గుట్టు ర‌ట్టయ్యింది. ఆ హోటల్‌లో పనిచేసే మహిళా సిబ్బంది కూడా సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్నట్లు ఆ అమ్మాయి చెప్పింది.

 

అత‌డు ఆ రూమ్ నుంచే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు. దీంతో వెంట‌నే ముంబై క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పాటిల్ సిబ్బందితో కలిసి హోటల్‌పై రైడ్ చేశారు. 40 మంది సెక్స్ వర్కర్లు రక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు. బ్లూస్టార్ నిర్వాహకులను పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించి కేసు న‌మోదు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: