ఆంధ్రప్రదేశ్ లో కష్టాలు పడుతున్న టీడీపీకి నేతలు ఒక్కొక్కరిగా షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు చంద్రబాబుకి నమ్మకంగా ఉన్న ఒక్కో నేత పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారు. కడప జిల్లా విషయానికి వస్తే ఇప్పుడు దాదాపు అదే వాతావరణం కనపడుతుంది. జిల్లాలో స్థానిక నాయకత్వం కొద్దిగే ఉన్నా... ఆ పార్టీకి క్యాడర్ మాత్రం బలంగా ఉంది. అయితే గెలుపు ఓటములను మాత్రం ప్రభావితం చేసే స్థాయిలో క్యాడర్ లేదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

 

వైఎస్ కుటుంబానికి జిల్లాలో మంచి బలం ఉండటంతో టీడీపీ ఇక్కడ గెలవడం కష్టంగా మారింది. ఇటీవల జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అనే భావనతో ఆయన ముందు జాగ్రత్త పడ్డారు. ఇక రామసుబ్బా రెడ్డి కూడా అదే బాటలో ఉన్నారని అంటున్నారు.

 

ఆయన అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో విమానాశ్రయంలో ముఖ్యమంత్రి జగన్ కలవగా సన్నిహితంగా మాట్లాడారు. జగన్ ఆప్యాయంగా పలకరించారు కూడా. ఇక ఆదినారాయణ రెడ్డి వ్యతిరేక వర్గం జమ్మలమడుగులో ఉంది. ఇప్పుడు వారందరూ కూడా రామసుబ్బారెడ్డి పార్టీ మారితే మారాలని చూస్తున్నారు. ఇక పులివెందులలో సతీష్ రెడ్డి ఉన్నా నామమాత్రమే. ఇక ఎమ్మెల్సీ బిటెక్ రవి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కమలాపురం ఇంచార్జ్, కడప అసెంబ్లీ ఇంచార్జ్ కూడా పార్టీ మారే సూచనలు కనపడుతున్నాయి.

 

మరో రెండు నియోజకవర్గాల నేతలు... ఎంపీ అవినాష్ రెడ్డిని కలిసినట్టు సమాచారం తాను పార్లమెంట్ సమావేశాల్లో బిజీ గా ఉన్నాను అని వచ్చిన తర్వాత చూద్దామని చెప్పారట. అవినాష్ రెడ్డి జగన్ వద్దకు తీసుకువెళ్తే వెళ్లే అవకాశం ఉంది... ఇక రాయచోటి నుంచి కూడా పార్టీ మారడానికి స్థానిక నాయకత్వం శ్రీకాంత్ రెడ్డిని కలిసినట్టు సమాచారం. ఇలా ప్రతీ నియోజకవర్గంలో నేతలు పార్టీ మారడానికి సిద్ధం కావడం పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: