చంద్రబాబునాయుడు పుత్రరత్నం నారా లోకేష్ ఇమేజికి బాగా డ్యామేజి  జరిగిపోయింది. ఎలాగంటే గతంలో ఎన్నడు లేనివిధంగా లోకేష్ నాయకత్వ సామర్ధ్యాలపై పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి తండ్రిచాటు బిడ్డగానే లోకేష్ ఇంతకాలం నెట్టుకొచ్చేశారు. ప్రతిపక్షంలో ఉండగానే లోకేష్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

 

పార్టీ పదవి కాబట్టి అందులోను భవిష్యత్ అధినేత అనే ట్యాగ్ ఎలాగూ ఉంది కాబట్టి పార్టీలోని సీనియర్లు కూడా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండే  లోకేష్ నాయకత్వంపై చర్చ మొదలైంది. దానికితోడు ఎంఎల్ఏగా పోటి చేయించకుండా దొడ్డిదోవన ఎంఎల్సీ, మంత్రిని చేయటంతోనే లోకేష్ నాయకత్వంపై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.

 

ఈ నేపధ్యంలోనే మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయంతోనే లోకేష్ ఫెయిల్యూర్ మొదలైంది. ఎందుకంటే మంగళగిరిలో పోటి చేసిన చినబాబు ఓడిపోవటంతో లోకేష్ లో నాయకత్వ లక్షణాలు లేవని అందరు నిర్ధారణకు వచ్చేశారు.  ఇటువంటి సమయంలోనే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ చినబాబు టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు లోకేష్ ను బాగా డ్యామేజి చేసినట్లు అర్ధమవుతోంది.

 

చంద్రబాబు కొడుకు అనితప్ప లోకేష్ లో మరే లక్షణం లేదని వంశీ చెప్పిన మాటలు పార్టీ నేతల్లో బాగా నాటుకుపోయాయి. అదే సమయంలో మంత్రి కొడాలి నాని కూడా లోకేష్ గాలి తీసేశారు. అసలే లోకేష్ పై నేతల్లో ఉన్న నెగిటివ్ అభిప్రాయం వంశీ, కొడాలి నాని కామెంట్లతో మరింత ఎక్కువైంది. ఇపుడు పార్టీ మారిన నేతలు కానీ మారాలని అనుకుంటున్న నేతలు కానీ లోకేష్ ను టార్గెట్ గా చేసుకునే వ్యాఖ్యలు చేస్తున్న విషయం గమనించాలి.

 

చంద్రబాబుకు వయసైపోయిందని లోకేష్ నాయకత్వానికి పనికిరాడని చెబుతూ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. మొత్తం మీద లోకేష్ ఇమేజికి  వంశీ వల్ల భారీగానే డ్యామేజి జరిగిందన్నది వాస్తవం. ఈ పరిస్ధితుల్లో లోకేష్ ను భావి అధినేతగా ఎలా ప్రొజెక్టు చేయాలో చంద్రబాబు కూడా అర్ధం కావటం లేదు. అందుకనే కొందరు నేతలు లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించవద్దని చంద్రబాబుకు ఇప్పటికే చెప్పేశారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: