గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మారాలని నిర్ణయం తీసుకోవడం ఏమో గాని... గన్నవరంలో టీడీపీకి చుక్కలు కనపడుతున్నాయి అనేది వాస్తవం. రాజకీయంగా ఒక పక్క ఇబ్బంది పడుతున్న అధిష్టానానికి ఈ పరిణామం చికాకుగా మారింది. వంశీ మారిపోతున్నారు. ఆయన తర్వాత సారధ్యం వహించేది ఎవరు ? స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ముందు ఉండి నడిపించేది ఎవరు ? ఇప్పుడు ఈ ప్రశ్న చంద్రబాబుకి తలనొప్పిగా మారిపోయింది.

 

పార్టీ క్యాడర్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది... వారు అందరూ వంశీతో పాటు వెళ్ళిపోతే..? అందుకే వంశీ రాజీనామా లేఖ ఇచ్చిన వెంటనే నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించారు. క్యాడర్ కూడా బాగానే వచ్చింది... కానీ వారిని ముందు ఉండి నడిపించే నేత మాత్రం కనపడటం లేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో చెప్పినట్టు ఎవరిని పడితే వాళ్ళను తీసుకొచ్చి పెడితే పరిస్థితులు అంత అనుకూలంగా ఏం మారవు.

 

ఇప్పుడు క్యాడర్ లో ధైర్యం నింపే నాయకుడు కావాలి... కానీ అది ఎవరు అనేది అర్ధం కావట్లేదు. దేవినేని అవినాష్ కి గన్నవరం బాధ్యతలు అప్పగిద్దాం అని చూడగా ఆ తల నొప్పి నాకు ఎందుకు అని ఆయన సర్దుకున్నారు. ఆయ‌న వైసీపీలోకి జంప్ చేసిన నాలుగు రోజుల‌కే ఆ పార్టీ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు ఇచ్చేశారు. ఇక ఇప్పుడు దేవినేని ఉమాను గన్నవరం పంపించాలని అధిష్టానం చూస్తుందని అంటున్నారు. స్థానిక క్యాడర్ లో వంశీకి అనుకూలంగా ఉండే నేతలు ఎక్కువగా ఉన్నారు.

 

వారు అందరూ కూడా ఉమా మీద ఆగ్రహంగా ఉన్నారు. ఆయన వెళ్లిపోవడానికి ఉమానే కారణం అనే భావన అక్కడి క్యాడర్ లో ఉంది. కాబట్టి ఆయన్ను పంపిస్తే ఫలితం ఉండకపోగా ఉన్న వాళ్ళు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇక గద్దె కుటుంబాన్ని పంపాలని చూసినా ఫలితం మాత్రం పెద్దగా కనపడలేదు. దీంతో ఇప్పుడు వంశీతో పాటు క్యాడర్ కూడా వెళ్తే పరిస్థితి ఏంటి అనే ఆందోళన అధిష్టానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: