అవును అనటానికి తాజగా నారా లోకేష్ అన్న మాటలే  ఉదాహరణగా నిలుస్తోంది. కేంద్రమాజీ మంత్రి, రాజ్యసభ ఎంపి, చంద్రబాబునాయుడు బినామీగా ప్రచారంలో ఉన్న సుజనా చౌదరి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. తొందరలోనే టిడిపికి చెందిన 20 మంది ఎంఎల్ఏలు బిజెపిలోకి మారిపోతున్నారు అని చెప్పారు. అదే విషయమై వ్యాఖ్యానించటానికి ఇష్టపడలేదు.

మీడియా ఒకటికి రెండుసార్లు అడిగినపుడు తాను ’ సుజనా వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడను’ అని తప్పించుకున్నారు. మామూలుగా అయితే టిడిపి ఎంఎల్ఏలను ఉద్దేశించి సుజనా చేసిన వ్యాఖ్యలు చాలా డ్యామేజింగ్ అనే చెప్పాలి. తెలుగుదేశంపార్టీ తరపున గెలిచిన 23 మందిలో 20 మంది ఎంఎల్ఏలు బిజెపిలో చేరిపోతారని ప్రకటించారంటే ఏమిటర్ధం ?

ఇదే కామెంట్ ఇంకెవరైనా చేసుంటే చంద్రబాబునాయుడు దగ్గర నుండి చినబాబు, టిడిపి నేతలు విరుచుకుపడిపోయేవారే అనటంలో సందేహం లేదు. కానీ ఇక్కడ మాట్లాడింది సుజనా కాబట్టే లోకేష్ కూడా కనీసం ఖండించటానికి కూడా ఇష్టపడటం లేదు. అంటే సుజనా ప్రకటనలో నిజముందని అనుకోవాలా ? లేకపోతే సుజనా అంటే లోకేష్ భయపడుతున్నారని అనుకోవాలా ?

ఈ విషయాలను పక్కనపెడితే చంద్రబాబు మనిషిగానే సుజనా టిడిపి నుండి బిజెపిలోకి వెళ్ళారనే ప్రచారానికి ఊతమిస్తోంది. చంద్రబాబు మీద ఎటువంటి కేసులు పడకుండా, తనపైన ఉన్న సిబిఐ, ఐటి, ఇడి కేసులు పెట్టకుండా చూసుకునేందుకే చంద్రబాబే కేంద్ర మాజీమంత్రిని ముదుజాగ్రత్తగా బిజెపిలోకి పంపారనే ప్రచారం బాగా జరుగుతోంది.

జరుగుతున్న ప్రచారానికి తాజాగా లోకేష్ మాటలకు చక్కగా లింకు కనబడుతోంది. సుజనా ప్రకటన తప్పని, బిజెపిలోకి వెళ్ళే ఎంఎల్ఏలు ఎవరూ లేరన్న మాటను మొహమాటానికి కూడా లోకేష్ చెప్పటానికి ఇష్టపడలేదంటే ఏమిటర్ధం ? అదే పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ ఆరోపణలపై లోకేష్ నుండి టిడిపి నేతలు ఎంతమంది రెచ్చిపోయి మీడియా సమావేశాలు పెట్టింది అందరూ చూసిందే. వంశీకి వ్యతిరేకంగా వరుసగా  లేచిన అన్ని గొంతులు సుజనా మీద మాత్రం లేవకపోవటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: