ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వం లో  విలీనం చేయాలని డిమాండ్ సహా 26 డిమాండ్లను నెరవేర్చాలి అంటూ  ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె సైరన్ మోగించిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె దాదాపు 47 రోజులకు చేరుకున్న తర్వాత ఒక డిమాండ్ కూడా పరిష్కారం కాకుండానే ఆర్టీసీ చేసిన సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించింది. అయితే గతంలో ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరిపిన ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని  డిమాండ్ ఒక్కటి మినహా మిగతా డిమాండ్లపై చర్చిస్తామని చెప్పినప్పటికీ ఒక్క డిమాండ్  కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన అదే ఆర్టీసీ జేఏసీ... ఇప్పుడు ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించకుండా ఆర్టీసి సమ్మె విరమించింది . అయితే ఆర్టీసీ జేఏసీ ప్రకటన పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా 47 రోజులు ఆర్టీసీ సమ్మె లో ఎన్నో పరిణామాలు మరెన్నో వివాదాలు...ఇంకెన్నో  నిరసనలు... కానీ చివరికి  అటు ప్రభుత్వ పంతమే నెగ్గింది. 

 

 

 

 47 రోజుల ఆర్టీసీ సమ్మె లో ఎందరో ఆర్టీసీ కార్మికుల బలిదానాలు ఎందరో ఆర్టీసీ కార్మికుల  మనోవేదన... అయినప్పటికీ ఆర్టీసీ జేఏసీ నేతల మీద నమ్మకంతో ముందుకు నడిచారు  కార్మికులు కాని చివరికి ఆర్టీసీ జేఏసీ నేతలు ఆర్టీసీ కార్మికులను నట్టేట ముంచారు. హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్న ఆర్టీసీ కార్మికులను డిమాండ్ పరిష్కారమైతే బతుకులు బాగుపడతాయని నమ్మించి 47 రోజుల పాటు సమ్మె ను కొనసాగించి  చివరికి ఉద్యోగాలు మళ్ళీ ఇవ్వాలంటూ ఆర్టీసీ జేఏసీ కోరుతుంది. దీని కోసమా  ఆర్టీసీ కార్మికుల సమ్మె నిర్వహించి.? దీనికోసమా  ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకుంది.?  దీనికోసమా  ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు పోషణ కరువై అల్లాడుతున్న సమ్మె కోసమై  కదిలింది.?  ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తినేలా ఆర్టీసీ జేఏసీ ప్రకటన చేసిందని పలు కార్మిక సంఘాలు అంటున్నాయి. హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్న ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దింపి 47 రోజుల పాటు సమ్మె కొనసాగించి  ఇప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి అనుకుంటున్న సమయంలో మళ్లీ అదే ఉద్యోగాలు ఇస్తే చాలు ఇంకేం వద్దు అంటూ ప్రకటన చేయటం ఏంటని  పలువురు ప్రశ్నిస్తున్నారు. 

 

 

 

 అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులకు అటు హైకోర్టులో కూడా షాక్ ఎదురైంది. ఇప్పటికే హైకోర్టులో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమైనదన్ని తాము చెప్పలేమని... ఈ సమస్యను లేబర్ కోర్టులు తేల్చుకోవాలంటూ  చెప్పి షాకిచ్చిన హైకోర్టు... ఇక తాజాగా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేపట్టడంలో ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు కూడా  ఉంటాయా ఉడతాయా  అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిపోయింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే సినిమాకు అశ్వద్ధామ రెడ్డి దర్శకుడు అయితే నిర్మాత కెసిఆర్ అంటూ తెలంగాణ ప్రజానీకం భావిస్తోంది. అశ్వద్ధామ రెడ్డి సమ్మె   తలపెట్టకుంటే కేసిఆర్ మనసులోకి ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే అంశంపై వచ్చేది కాదు కదా అంటూ భావిస్తున్నారు. ఇప్పుడు అటు డిమాండ్లు పరిష్కారం కాకపాయే... ఇటు  ఉద్యోగము పాయే  ఇక ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఏంటి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: