ఓ వైపు రచ్చబండకు ఏపీ సీఎం జగన్ రెడీ అవుతుంటే... స్థానిక ఎన్నికలకు వైసీపీ సమాయత్తమవుతోంది. రెండంచెల వ్యూహంతో ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. సీఎంగా జగన్‌ బాధ్యతల చేపట్టిన కొన్నాళ్లకే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే ప్రచారం జరిగినా.. అది ఇప్పటి వరకు వర్కవుట్ కాలేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికల తరుణంలో జగన్ రచ్చబండకు రెడీ అవుతున్నారు. 

రచ్చబండ. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ బ్రాండింగ్‌ ఉన్న కార్యక్రమమిది. జగన్‌ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రచ్చబండ కార్యక్రమాన్ని ఎప్పుడు మొదలు పెడతారు..? ఎప్పుడు రచ్చబండ సెకండ్‌ వెర్షన్‌ స్టార్ట్‌ చేస్తారు..? అనే చర్చ జరుగుతూనే ఉంది. అయితే దీనిపై ఇన్నాళ్లకు సీఎం జగనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. వివిధ శాఖల సెక్రటరీలు.. ఉన్నతాధికారులతో జరిపిన సమావేశంలో రచ్చబండ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు స్వయంగా సీఎం జగన్‌ వెల్లడించారు. జనవరి-ఫిబ్రవరి నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.

ఇంకా అధికారికంగా చెప్పకపోయినా.. అమ్మఒడి కార్యక్రమం మొదలయ్యే జనవరి 9 నే రచ్చబండ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి. చిత్తూరు, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఏదో జిల్లా నుంచి రచ్చబండ మొదలవుతుందని  చెబుతున్నారు. ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్‌ కావడం.. ప్రభుత్వ పథకాల అమలుపై వారి నుంచే ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడంతోపాటు.. ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకునే దిశగా జగన్ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జనవరి-ఫ్రిబవరి నెలల్లోనే నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రిపేర్‌ అవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేసిన సర్కార్‌.. సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. గత కెబినెట్‌ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన తెచ్చిన జగన్‌.. ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ సంకేతాలిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జనవరి 26 నుంచి ప్రారంభించాల్సి ఉన్న అమ్మఒడి కార్యక్రమాన్ని అదే నెల తొమ్మిదో తేదీకి ప్రీ-పోన్ చేసుకున్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని జగన్‌ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ముందుగా పంచాయతీ ఎన్నికలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి.. ఆ తర్వాత మండల, జెడ్పీ, మున్సిపల్ ఎన్నికలు జరపాలనేది సర్కారు వ్యూహంగా ఉంది.  

 వైపు రచ్చబండకు ఏపీ సీఎం జగన్ రెడీ అవుతుంటే... స్థానిక ఎన్నికలకు వైసీపీ సమాయత్తమవుతోంది. రెండంచెల వ్యూహంతో ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. సీఎంగా జగన్‌ బాధ్యతల చేపట్టిన కొన్నాళ్లకే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే ప్రచారం జరిగినా.. అది ఇప్పటి వరకు వర్కవుట్ కాలేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికల తరుణంలో జగన్ రచ్చబండకు రెడీ అవుతున్నారు. 

రచ్చబండ. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ బ్రాండింగ్‌ ఉన్న కార్యక్రమమిది. జగన్‌ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రచ్చబండ కార్యక్రమాన్ని ఎప్పుడు మొదలు పెడతారు..? ఎప్పుడు రచ్చబండ సెకండ్‌ వెర్షన్‌ స్టార్ట్‌ చేస్తారు..? అనే చర్చ జరుగుతూనే ఉంది. అయితే దీనిపై ఇన్నాళ్లకు సీఎం జగనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. వివిధ శాఖల సెక్రటరీలు.. ఉన్నతాధికారులతో జరిపిన సమావేశంలో రచ్చబండ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు స్వయంగా సీఎం జగన్‌ వెల్లడించారు. జనవరి-ఫిబ్రవరి నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.

ఇంకా అధికారికంగా చెప్పకపోయినా.. అమ్మఒడి కార్యక్రమం మొదలయ్యే జనవరి 9 నే రచ్చబండ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి. చిత్తూరు, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఏదో జిల్లా నుంచి రచ్చబండ మొదలవుతుందని  చెబుతున్నారు. ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్‌ కావడం.. ప్రభుత్వ పథకాల అమలుపై వారి నుంచే ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడంతోపాటు.. ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకునే దిశగా జగన్ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జనవరి-ఫ్రిబవరి నెలల్లోనే నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రిపేర్‌ అవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేసిన సర్కార్‌.. సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. గత కెబినెట్‌ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన తెచ్చిన జగన్‌.. ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ సంకేతాలిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జనవరి 26 నుంచి ప్రారంభించాల్సి ఉన్న అమ్మఒడి కార్యక్రమాన్ని అదే నెల తొమ్మిదో తేదీకి ప్రీ-పోన్ చేసుకున్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని జగన్‌ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ముందుగా పంచాయతీ ఎన్నికలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి.. ఆ తర్వాత మండల, జెడ్పీ, మున్సిపల్ ఎన్నికలు జరపాలనేది సర్కారు వ్యూహంగా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: