రైతు భరోసా పధకాన్ని ప్రభుత్వం ఇటీవలే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.  ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ . 13,500 రూపాయలను రైతుల ఖాతాలో వేసేందుకు సిద్ధం అయ్యింది.  మొత్తం ఈ పధకం ద్వారా ఎంతమంది లభ్ది పొందుతున్నారు.  ఎంతమందికి ఈ పధకం ద్వారా ఉపయోగం ఉంటుంది అనే విషయాలకు సంబంధించిన డేటా ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది.  


ఈ పధకం అమలుకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నది.  ఇప్పటికే కొంతమంది అకౌంట్స్ లో డబ్బులను ప్రభుత్వం జమ చేసింది.  అయితే, కొన్ని బ్యాంక్ అకౌంట్స్ లోకి ఇంకా డబ్బులు వెళ్లకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  దీనిని గమనించిన ప్రభుత్వం రైతుల అకౌంట్స్ కు సంబంధించిన సమస్యలను బ్యాంకులు పరిష్కరించాలని కోరింది.  అకౌంట్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే బ్యాంకులను సంప్రదించి పరిష్కరించుకోవాలని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.  


బ్యాంకు సమస్యలు పూర్తి చేసుకుంటే.. వారి అకౌంట్ లోకి డబ్బులు జమ అవుతాయని కన్నబాబు పేర్కొన్నారు.  వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చారు.  గత ప్రభుత్వం చెప్పినట్టుగా రైతు రుణ మాఫీ గురించి చెప్పకపోయినా.. రైతు భరోసా పధకం తీసుకొచ్చింది.  ఈ రైతు భరోసా పధకం ద్వారా రైతుల అకౌంట్స్ లోకి డబ్బులు నేరుగా వేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.  


రైతుల అకౌంట్స్ లోకి వైకాపా చెప్పినట్టుగా రూ. 15వేలు వేస్తామని చెప్పింది.  అయితే, ఇందులో 6,500 రూపాయలు కేంద్రం నుంచి అందుతున్నది.  దీనికి మిగతా డబ్బులు జమచేసి మొత్తం రూ . 15 వేలు రైతుల అకౌంట్స్ లోకి వేస్తున్నది.  ఈ పధకం ద్వారా లబ్ది పొందాలి అనుకునే రైతులకు కొన్ని సూచనలు చేసింది.  ఆ సూచనలు అనుసరించే ఈ పధకం అమలు జరుగుతున్నది.  దీంతో పాటుగా కౌలు రైతులకు కూడా ఈ పధకం అమలు జరగబోతున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: