ఒక పట్టాన సాధారణ జనాలకు ఎవరికీ అర్థమయ్యేలా కనిపించడం లేదు ఏపీ రాజకీయాలు. ఎప్పుడు ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది ఇంకెవరితో యుద్ధం చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే బిజెపి పూర్తిస్థాయిలో టార్గెట్ చేసేసుకుంది ఎలాగూ తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని బిజెపి ఒక అంచనాకు వచ్చేసింది. ప్రస్తుతం పది మంది వరకు టిడిపి ఎమ్మెల్యేలు బిజెపిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నా ఇప్పటి వరకు ఆదిశగా అడుగులు అయితే మాత్రం పడలేదు. ప్రస్తుతం వైసిపి నుంచి సుమారు 20 మంది వరకు ఎమ్మెల్యేలు బిజెపిలోకి వచ్చేందుకు తమతో మంతనాలు చేస్తున్నారంటూ ఏపీ బీజేపీ లీడర్లు ప్రచారం మొదలుపెట్టారు.

 

 ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా ఈ మేరకు ప్రకటనలు విడుదల చేస్తున్నారు.ఏపీలో లో తాము సొంతంగా ఎదిగి ప్రయత్నం చేయకుండా ఇలా ప్రాంతీయ పార్టీలను బెదిరించి పబ్బం గడుపుకోవడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను తమ పార్టీలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు అనే విషయం తెలిసినా బిజెపి మాత్రం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. నాయకులు వస్తే ఆ  తర్వాత నెమ్మదిగా కార్యకర్తలు కూడా వస్తారని, అప్పుడు తమ బలం మరింత పెరుగుతుంది అని బిజెపి భావిస్తోంది. కానీ ఏపీపై బీజేపీ మొదటి నుంచి చిన్నచూపు చూస్తూనే ఉంది. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాజధాని నిధులు, పోలవరం ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాల్లో ఏపీకి బిజెపి ప్రభుత్వం చేసింది పెద్దగా ఏమీ లేదు.

 

ఇప్పుడు అభివృద్ధికి సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించకుండా  అధికార పార్టీ వైసీపీని రాజకీయంగా బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తుంది. తమతో  పెట్టుకుంటే ఏపీలో మీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని, నిధుల విడుదల కూడా చేయమని, పరోక్ష హెచ్చరికలు చేస్తోంది బిజెపి. తమపైఎంతగా బెదిరింపు ధోరణులకు దిగినా జగన్ మాత్రం ఇవేవి పట్టించుకునే ఆసక్తి చూపించడంలేదు. తమకు అండగా ఎవరు ఉన్నా లేకపోయినా ప్రజల మద్దతు తమకే ఉంటుందని జగన్ భావిస్తున్నారు ఈ పరిణామాలు బిజెపికి మరింత ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: