తెలంగాణ పురపాలక ఎన్నికల్లో సత్తా చాటాలని కమలం పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ప్లాన్ చేస్తోంది. ప్రతి మున్సిపాలిటీకి ఒక మేనిఫెస్టో విడుదల చేయాలనీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ ,కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను నేరుగా కలిసే దిశగా పార్టీ నేతలు కార్యాచరణను రూపొందించుకున్నారు. 

 

సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకున్న తర్వాత బీజేపీ నాయకత్వం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాల్లో తమకు పట్టు ఎక్కువగా ఉందని బీజేపీ నేతల అభిప్రాయం... త్వరలో జరిగే మునిసిపల్ ఎన్నికల్లో తమకు మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకుంటున్నారు కాషాయ పార్టీ నేతలు. 

 

ప్రతి పార్లమెంట్ లోని మునిసిపల్ లను కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి సీనియర్ నేతలకు బాధ్యత అప్పగించింది పార్టీ.  క్లస్టర్ ల మీటింగ్ లు జరిగాయి. మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. ఈ నెల 25, 26న అసెంబ్లీ వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలనీ... ఆ అసెంబ్లీ పరిధిలో ఉన్న మునిసిపాలిటీలలోని వార్డ్ లకు ఇంఛార్జ్ లను ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. ప్రతి వార్డ్ ఐదుగురుకి ఆ మున్సిపాలిటీ కి చుట్టూ పక్కల ఉన్న గ్రామీణ నేతలకి బాధ్యతలు అప్పగించాలని పార్టీ ప్లాన్.  

 

నవంబర్ 27 న మునిసిపల్ వారీగా ఆ మునిసిపాలిటీలలోని కార్యకర్తలు, కొత్తగా వేసే వార్డ్ ఇంచార్జ్ లతో సమావేశం ఏర్పాటు చేయాలనీ... ఆ సమావేశంలో పార్టీ లో కొత్తవారి చేరికలు, స్థానిక సమస్యల పై ఆందోళన మునిసిపల్ వారిగా మేనిఫెస్టో తయారీ, ఛార్జ్ షీట్ వేయడం, కేంద్ర ప్రభుత్వ నిధుల పై ప్రచారం మీద చర్చించాలని పార్టీ నిర్ణయించింది. ఇక డిసెంబర్ 1 నుండి 3 వరకు వార్డ్ లలో ఓటర్ వేరిఫికేషన్, కేంద్రప్రభుత్వ లబ్ధిదారులను కలవాలని పార్టీ కార్యాచరణ రూపొందించింది. పార్టీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రలు కూడా మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిందే. మునిసిపాలిటీ లలోనే ఎక్కువ యాత్రలు చేశారు నాయకులు. మరి బీజేపీ తమ కార్యాచరణను ఏ మేరకు క్షేత్ర స్థాయిలో అమలు చేస్తుందో... ఓటర్ల ను ఎంత వరకు ఆకర్షిస్తుందో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: