ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి . ఇప్పటికే టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీడీపీకి గుడ్బై చెప్పేసి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఇక అంతే కాకుండా టిడిపి యువత విభాగం అధ్యక్షుడు అయిన దేవినేని అవినాష్ కూడా వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఇక టీడీపీ లోకి కీలక నేత అయిన వల్లభనేని వంశీ కూడా టిడిపి పార్టీ సభ్యత్వానికి స్థానానికి రాజీనామా చేస్తానని చెప్పి  టీడీపీ అధినేత చంద్రబాబు పైన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ముగుస్తున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు మాస్టర్ మైండ్ వ్యూహాలు ఇప్పుడు పని చేయడం లేనట్లు కనిపిస్తోంది. అంతే కాదు టిడిపి పార్టీ నుంచి ఎప్పుడు ఎవరు ఎగిరిపోయి ఇతర పార్టీలో వాలుతారో ఊహించలేక పోతున్నారు. 

 

 

 

 ఇదిలా ఉండగా తాజాగా బీజేపీ ఎంపీ  సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారు అంటూ  బిజెపి ఎంపీ సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పాటు వైసీపీలోనే ఎమ్మెల్యేలు  కూడా తమతో టచ్లో ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అయితే తమ పార్టీ నుంచి బీజేపీ లోకి వెళ్ళడానికి ఎవరు రెడీగా లేరంటూ  ఇప్పటికే వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అటు టీడీపీ కూడా సుజనా చౌదరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. కాగా  గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 23 అసెంబ్లీ స్థానాలు మాత్రమే... అయితే ఆ 23 ఎమ్మెల్యేల్లో  వల్లభనేని వంశీ తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఇక అటు వైసీపీ నేతలు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలుచుకుంటే అర్ధగంటలో టిడిపి పార్టీ మొత్తం వైసిపి పార్టీ స్టోర్ రూంలో ఉంటుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యలు కూడా ఆంధ్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. 

 

 

 

 కాగా తెలుగుదేశం పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలలో 20 మంది మినహాయిస్తే మిగిలేది ముగ్గురే. అయితే చివరికి టీడీపీలో మిగిలే   ఆ ముగ్గురు నేతలు ఎవరై  ఉంటారన్నది కూడా ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. అయితే ఆ ముగ్గురు ఎవరన్నది వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు. వైసీపీ అధినేత చంద్రబాబు నాయుడు,  ఆయన వియ్యంకుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అనంతపురం జిల్లా ఉరవకొండ కు చెందిన పయ్యావుల కేశవ్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. టిడిపిలో చివరికి ఈ ముగ్గురు మాత్రమే మిగులుతారు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: